Tuesday, May 7, 2024

ఓ విలన్‌లా చూశారు: యువరాజ్ సింగ్

- Advertisement -
- Advertisement -

ముంబయి: తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన సందర్భం ఏదైన ఉందంటే అది 2014 ట్వంటీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అని టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఆ ఫైనల్ సమరం తర్వాత తాను చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చిందన్నాడు. అందుకు శ్రీలంకతో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో తన బ్యాటింగ్ ప్రదర్శనే కారణమన్నాడు. వరల్డ్‌కప్ తుది సమరంలో తాను అత్యంత చెత్త బ్యాటింగ్ కనబరిచానని, అదే తనపై అభిమానుల ఆగ్రహానికి కారణమన్నాడు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో తాను ఘోరంగా విఫలమైన విషయాన్ని యువరాజ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తాను 21 బంతులు ఆడి కేవలం 11 పరుగులు మాత్రమే చేశానన్నాడు.

దీంతో తనపై అభిమానుల ఆగ్రహానికి అంతులేకుండా పోయిందన్నాడు. ఆ ఫైనల్ మ్యాచ్ తర్వాత చాలా రోజు వరకు అభిమానులు తనను ఓ విలన్‌గా చూశారని యువరాజ్ వాపోయాడు. అంతేగాక ఒక దశలో కొందరూ తన ఇంటిపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారన్నాడు. అదే 2007 టి20 వరల్డ్‌కప్, 2011 ప్రపంచకప్‌లో జట్టుకు ఒంటి చేత్తో ట్రోఫీ అందించిన విషయాన్ని ఇక్కడ అభిమానులు మరచి పోయారన్నాడు. దీన్ని బట్టి భారత్‌లో క్రికెటర్ ప్రదర్శనను బట్టి ఆదరణ ఉంటుందనే విషయం తనకు అర్థమైందన్నాడు. ఇక, ఆ ఫైనల్ తర్వాత తాను మళ్లీ టీమిండియాలో ఆడతానని ఊహించలేదన్నాడు. అయితే ఆ తర్వాత కూడా తనకు దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నట్టు యువరాజ్ తెలిపాడు. ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న యువరాజ్ ఈ విషయాలు వెల్లడించాడు.

Yuvraj Singh live Instagram chat with Fans

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News