Saturday, April 27, 2024

నాలో ఎవరికీ తెలియని మరో యాంగిల్ ఉంది

- Advertisement -
- Advertisement -

“గత 16 ఏళ్లుగా బాలీవుడ్‌లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాను. అయితే అప్పటికీ, ఇప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరిగాయి”అని అంటోంది బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్. “ప్రస్తుతం ఇండస్ట్రీపై ఓ క్లారిటీ వచ్చింది. మంచేదో, చెడోదో తెలుసుకోగలుగుతున్నాను. అందువల్లే ఇన్నేళ్లు అయినా అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి రాలేదు. అంతేకాదు బయట అందరికీ తెలిసిన కత్రినా వేరు.. నాలోని కత్రినా వేరు. నాలో ఎవరికీ తెలియని మరో యాంగిల్ కూడా ఉంది”అని ఈ భామ పేర్కొంది. కత్రినా చూడటానికి ఎప్పుడూ కూల్‌గా కనిపిస్తుందట. కానీ లోపల కత్రినా వేరట. సినిమాలో ఏ సీన్ ఎలా చేయాలి… యాక్టింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అని లోలోపల తెగ ఆలోచిస్తూ ఉంటుందట. “డ్యాన్స్, సాంగ్స్, గ్లామర్, కాస్టూమ్స్… ఇలా ఒకటేమిటి చేసే సినిమాలోని ప్రతి విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా పని నేను చేసుకొని ఇంట్లో కూర్చోవడం అస్సలు నచ్చదు నాకు. నలుగురికి పనికొచ్చే పనిచేస్తేనే తృప్తిగా ఉంటుంది”అని చెప్పింది ఈ హాట్ భామ.

I had faced many problems in Bollywood: Katrina Kaif

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News