Thursday, May 9, 2024

జూన్ 3న ఇంటర్ పెండింగ్ పరీక్షలు

- Advertisement -
- Advertisement -

TS Inter Board

మనతెలంగాణ/హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో నిలిపిపోయిన ఇంటర్ పెండింగ్ పరీక్షలను జూన్ 3వ తేదీన నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జియోగ్రఫీ పేపర్ 2, మాడర్న్ లాంగ్వేజ్ పేపర్ 2 పరీక్షలను పాత హాల్ టికెట్లతో పాత పరీక్షా కేంద్రాలలోనే జూన్ 3వ తేదీన(బుధవారం) ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ స్పష్టం చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు మార్చి 3వ తేదీన జరగాల్సి ఉండగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆ పరీక్షలను వాయిదా వేశారు.
విద్యార్థులను ఫీజులు అడగొద్దు
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రైవేట్, కార్పోరేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తూ ద్వితీయ సంవత్సరం ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. లాక్‌డౌన్ కారణంగా వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించిన జూనియర్ కళాశాలలకు ఇంటర్ బోర్డు ఇప్పటివరకు ఎలాంటి అనుబంధ గుర్తింపు జారీ చేయలేదని, కాబట్టి విద్యార్థులను 2020 21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయవద్దని అన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఆన్‌లైన్ తరగతులు, ఇతర తరగతులు నిర్వహించవద్దని తెలిపారు. ఇంటర్ విద్యార్థులకు ఎంసెట్, నీట్, జెఇఇ పరీక్షల కోసం ఉచితంగా ఆన్‌లైన్ తరగతులు, ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇంటర్ విద్యాశాఖ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

TS Inter Board to conduct pending exams 2020 on June 3

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News