Monday, May 6, 2024

ఆహార భద్రతకు వ్యవసాయ పరిశోధనలు అతిముఖ్యం

- Advertisement -
- Advertisement -

Narendrasingh Thomar

జి20 శిఖారాగ్రసమావేశంలో తోమర్

న్యూఢిల్లీ: పెరుగుతున్న దేశ జనాభాకుతోడు ఆహార భద్రత, వాతావరణ మార్పు సమస్యలు జతకావడం ఆందోళనకరంగా తయారవుతోందని శనివారం జి20 శిఖరాగ్రసమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. 2030-31 నాటికి భారత దేశ జనాభా 150 కోట్లు దాటగలదన్నారు. అలాంటప్పుడు దాదాపు 350 మిలియన్ టన్నుల ఆహారధాన్యాలు అవసరమవుతాయన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే కేవలం వ్యవసాయ పరిశోధనల వల్లే సాధ్యమని తెలిపారు. ఆహార భద్రత, అందుబాటు, లభించడం అన్నవి పరిశోధన వల్లనే సాధ్యం కాగలదన్నారు. ఆహారధాన్యాలతోపాటు వంటనూనెలు, పాలు, పాలపదార్థాలు, మాంసం, పౌల్ట్రీ, చేపలు, కాయగూరులు, పండ్లు, చక్కెర వంటి వాటికి కూడా గణనీయమైన డిమాండ్ పెరుగుతోందని ఆయన తెలిపారు.

ఓ ప్రక్క ప్రకృతివనరులేమో పరిమితంగా ఉన్నాయి. మరోప్రక్క వాతావరణ మార్పు సమస్యగా తయారైందన్నారు. జి20 వ్యవసాయ మంత్రుల సమావేశం సందర్భంగా పెరుగుతున్న ఆహారధాన్యాల డిమాండ్, వ్యవసాయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం, రైతుల ఆదాయాన్ని పెంచాల్సిన అవసరాన్ని పరిష్కరించేందుకుగాను ఇటలీ ఏర్పాటుచేసిన వ్యూహాత్మక సమావేశంలో ఆయన ప్రసంగించారు. వ్యవసాయ పరిశోధనే భారత్‌ను దిగుమతి దేశం స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి తెచ్చిందని ఈ సందర్భంగా తోమర్ తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తెచ్చిన అనుభవం భారత్‌కు ఉందని, గతంలో గింజధాన్యాలను ఉతత్తి చేయడంలో భారత్ గొప్ప అభివృద్ధిని సాధించిందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News