Wednesday, May 1, 2024

మరోసారి పెద్ద మననుసు చాటుకున్న ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -
నిరుపేద సరస్వతి పుత్రునికి ఎమ్మెల్సీ కవిత ఆర్థిక చేయూత
విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక ఆటంకం ఏర్పడిన యువకునికి భరోసా

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మరోసారి తన పెద్ద మనుసు చాటుకున్నారు. అభాగ్యులకు ఎప్పుడు అండగా నిలబడే ఆమె తాజాగా నిజామాబాద్‌కు చెందిన ఓ నిరుపేద యువకునికి ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆర్థిక చేయూత అందించారు. నగరానికి చెందిన సామల రితీష్‌కు అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు లభించింది. కానీ చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని పోషించే రితీష్ తండ్రి అమెరికాకు తన కొడుకుని పంపించే స్తోమత లేక ఇబ్బందుల పాలయ్యారు. ఈ విషయాన్ని రితీష్ ఎంఎల్‌సి కవితకు తెలిపారు. వెంటనే స్పందించిన ఎంఎల్‌సి కవిత రితీష్ అమెరికాకు వెళ్లడానికి అవసరమయ్యే ఖర్చులను భరించారు. వారికి టికెట్లు సొంత ఖర్చులతో ఇప్పించారు. తన కలను సాకారం చేసుకునేందుకు ఆర్థిక చేయూత అందించి అండగా నిలబడిన ఎంఎల్‌సి కవితకు రితీష్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News