Monday, April 29, 2024

నాలుగేళ్లలో 1.71 లక్షల అత్యాచార కేసులు

- Advertisement -
- Advertisement -

1.71 lakh rape cases in four years

న్యూఢిల్లీ : దేశంలో 2015 19 మధ్య కాలంలో 1.71 లక్షల అత్యాచార కేసులు నమోదవడం యావత్ భారత దేశాన్ని కలవరపెడుతోంది. వీటిలో అత్యధిక కేసులు మధ్యప్రదేశ్ నుంచి నమోదు కావడం ఆ రాష్ట్ర ప్రజలు సహా ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. బుధవారం రాజ్యసభలో లిఖిత పూర్వక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా ఈమేరకు అత్యాచార కేసులకు సంబంధించిన గణాంకాలను వెల్లడించారు. ఆ నాలుగేళ్లలో మధ్యప్రదేశ్‌లో మొత్తం 22,753 అత్యాచార కేసులు నమోదైనట్టు చెప్పారు. ఆ తరువాత స్థానం రాజస్థాన్ వహిస్తోంది. అక్కడ 20,937 అత్యాచార కేసులు నమోదయ్యాయని వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో 19,098, మహారాష్ట్రలో 14,707,ఢిల్లీలో 8,051, కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఆ గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 2015 లో 34,651 , 2016 లో 38,947 , 2017 లో 32,559, 2018 లో 33,356 . 2019 లో 32.033 అత్యాచార కేసులు నమోదయ్యాయి.

1.71 lakh rape cases in four years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News