Saturday, May 4, 2024

వందల మంది ప్రాణాలు సేఫ్.. లోకల్ హీరోగా బాలుడు

- Advertisement -
- Advertisement -

మాల్దా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలో పదేళ్ల బాలుడు సమయస్ఫూర్తితో వందల మంది ప్రాణాలను కాపాడాడు. పట్టాలపై వేగంగా వెళ్తున్న రైలును పెను ప్రమాదం నుంచి కాపాడాడు. దీంతో రైల్వే శాఖతో పాటు అందరి ప్రశంసలు అందుకుంటూ లోకల్ హీరోగా మారిపోయాడు.

హరిశ్చంద్రపూర్ రెండో బ్లాక్‌లోని మషల్దా గ్రామ పంచాయతీ కరియాలి గ్రామంలో పదేళ్ల బాలుడు ముర్సెలీన్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. తండ్రి ఉద్యోగరీత్యా వలస వెళ్లడంతో తల్లి, సోదరి, సోదరుడి వద్ద ఉంటున్నాడు. అయితే ముర్సెలీన్ స్థానిక చెరువులో చేపల వేటకు వెళ్లాడు. అతను చేపలు పట్టే ప్రాంతానికి సమీపంలో రైలు పట్టాలు ఉన్నాయి. ఈ క్రమంలో రైలు పట్టాల కింద పెద్ద రంధ్రం ఉండడాన్ని ముర్సెలిమ్ గమనించాడు.

అయితే ఈలోగా వందలాది మంది ప్రయాణికులతో కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలపై వేగంగా దూసుకుపోతోంది. ఇది చూసిన ముర్సెలీం అప్రమత్తమై పట్టాలపైకి దూసుకెళ్లాడు. అతను తన ఎర్రటి టీ షర్టు విప్పి లోకో పైలట్‌కి సిగ్నల్ ఇచ్చాడు. టీ షర్ట్ ఊపుతూ కాసేపు అక్కడే నిల్చున్నాడు. ఇది చూసిన లోకో పైలట్ అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. ఆ తర్వాత ఇంజన్ దిగి బాలుడిని అభినందించారు. అనాథరామ్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ, ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రంధ్రంను పూడ్చారు. గంట తర్వాత రైలు యథావిధిగా బయలుదేరింది. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News