Monday, April 29, 2024

100% వ్యాక్సినేషన్ వైపు…

- Advertisement -
- Advertisement -

100% vaccination should be completed:Harish Rao

హ్యాబిటేషన్‌లు, గ్రామాలు, మండలాల వారీగా లక్ష్యాలు నిర్దేశించుకోవాలి, 100శాతం లక్ష్యాన్ని చేరుకుంటేనే
కొవిడ్ నుంచి పూర్తి రక్షణ, 18 సం. పైబడినవారు రాష్ట్రంలో 2కోట్ల 77లక్షల మంది ఉన్నారు, ఇప్పటివరకు 3కోట్ల
43లక్షల డోసులిచ్చాము, 2కోట్ల 35లక్షల మందికి మొదటి డోసు, కోటి 8లక్షల మందికి రెండో డోసు అందాయి :
జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్‌ఒలు, డిసిహెచ్‌ఒలతో వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణను 100 శాతం కొవిడ్ వాక్సినేషన్ జరిగిన రాష్టంగా తీర్చిదిద్దు తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాతం వాక్సినేషన్‌తోనే కొవిడ్ ప్రభావం నుంచి పూర్తిగా భద్రత పొందగలుగుతామని ఆయన న్నారు. శనివారం బిఆర్‌కెఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్ట ర్లు, డిఎఎంహెచ్‌ఒలు, డిసిహెచ్‌లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వారం సాధించిన లక్ష్యాలను స మీక్షించాలన్నారు. రాష్టంలో 18 ఏళ్లు పైబడిన ప్రజలు 2 కోట్ల 77 లక్షల మంది ఉన్నట్లు ఉన్నారని, ఇప్పటివ రకు రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 43 లక్షల వాక్సిన్ డోసు లు ఇచ్చామని, అందులో 2 కోట్ల 35 లక్షల మందికి మొదటి డోస్, 1 కోటి 8 లక్షల మందికి రెండో డోస్ ఇ చ్చినట్లు తెలిపారు. అర్హత కలిగిన 18.66 లక్షల మంది రెండో డోస్ వేసుకొనేందుకు వ్యాక్సిన్ కేంద్రాలకు రా వాల్సి ఉందని అన్నారు. రాష్టంలో అర్హత కలిగినట్లు గుర్తించిన వారిలో 85శాతం మంది మొదటి డోస్ వా క్సిన్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. మిగిలిన వారికి కూడా వాక్సిన్ వేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరా రు. వాక్సినేషన్ ప్రక్రియను విజయవంతం చేయుటకు పంచాయతీ రాజ్, ఇతర శాఖల సహకారాన్ని తీసు కోవాలని మంత్రి సూచించారు.

ప్రభుత్వాసుపత్రుల్లో అధునిక పరికరాలు

ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 8 మెడికల్ కాలే జీల భవనాలను డిసెంబర్‌లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను హరీశ్‌రావు ఆదేశించారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల పడకల సామర్థాన్ని పెంచాలని సూచించారు. అలాగే విద్యార్థు ల వసతికి అనువైన హాస్టల్ బిల్డింగ్స్‌ను గుర్తించాలని తె లిపారు. ముఖ్యమంత్రి ప్రభుత్వ ఆసుపత్రు ల్లో మౌలిక వసతులు కల్పన, పరికరాలు ఏ ర్పాటు చేసినట్లు మంత్రి అయితే ఈ వస తులను సక్రమంగా వినియోగించుకునేందుకు అవసర మైన వైద్యులు, సిబ్బంది నియమించుకునే అధికారాన్ని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఇచ్చిందని గుర్తుచేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచి తంగా 946 రకాల వైద్యసేవలు అందిస్తున్నట్లు, ప్రభు త్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి అదనంగా ఆయుష్మాన్ భారత్ కింద 646 రకాల వైద్య సేవలను ప్రభుత్వం చేర్చిన్నట్లు చెప్పారు. వైద్యానికి ముఖ్యమంత్రి పెద్ద పీట వేశారని అన్నారు. వైద్యానికి మరో 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని సిఎం తెలిపారని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ డైయాగ్నోస్టిక్ సెంటర్స్ సేవల ను ప్రజలకు అందించాలి, ఇకనుంచి ప్రభుత్వ ఆసుప త్రుల ఆకస్మిక తనిఖీలు ఉంటాయని హెచ్చరించారు.

పనితీరు మెరుగుపడాలి

జిల్లాల్లో ఉన్న ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల పనితీరును మెరుగుపడాలని రెగ్యులర్‌గా మానిటరింగ్ చేయాలని జిల్లా కలెక్టర్లు, డిఎంహెచ్‌ఒ లు, డిసిహెచ్‌లను మంత్రి ఆసుపత్రుల్లో రోగుల అక్యూపెన్సీ, సర్జరీలను సమీక్ష చేయాలని అ న్నారు. ఆసుపత్రులకు మంజూరైన ఆక్సిజన్ ప్లాంట్ల పనులను పూర్తి చేయించాలని, ప్రత్యేకశ్రద్ధ వహించాలన్నారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమి టీ సమావేశాల్లో తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్ట ర్లకు సూచించారు. జిల్లా పర్యటనల్లో భాగంగా ప్రభు త్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు చేసి, సమీక్షలు జరుపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆశావర్కర్ నుంచి హాస్పిటల్ సూపరింటెండెంట్ వరకు అందరి పనితీరు ను మానిటర్ చేయాలని చెప్పారు. పనితీరు ను బట్టే పోస్టింగ్‌లు, ప్రొత్సాహకాలు ఉంటాయని స్ప ష్టం చేశారు. జిల్లాల్లో ఉన్న ఆర్.బి.ఎస్.కె యూనిట్లను ఆక్టివేట్ చేయాలని మంత్రి తెలిపారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వి, డీహెచ్ డా. జి. శ్రీనివాసరావు, డిఎంఇ డా.రమేష్ రెడ్డి, ఒఎస్‌డి డా. గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

 

‘మూడో’ ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధం
నిలోఫర్‌లో రూ. 33కోట్లతో అదనంగా
మరో 800 పడకలు

నాంపల్లి : రాష్ట్రంలో కొవిడ్ మూడో దశ ముప్పుతోపాటు ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా సిద్ధంగా ఉందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహమ్మారి ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సిఎం కెసిఆర్ రూ. 133 కోట్లు విడుదల చేశారని, ఈ నిధులతో సర్కార్ ఆస్పత్రులను బలోపేతంగాచేసే దిశగా అదనంగా 5వేల పడకలను సిద్ధంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. శనివారం ఐసి, నిర్మాణ సంస్థల పక్షాన ఆస్పత్రిలో ఆధునీకరించిన చిన్నారుల ఐసియు బ్లాక్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిలోఫర్ ఆస్పత్రికి వచ్చే పేద రోగుల నమ్మకాన్ని పెంచేలా వైద్యసిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రస్తుతం వెయ్యి పడకల సామర్థం కల్గిన ఈ ఆస్పత్రిలో అదనంగా మరో 800 పకడలను పెంచుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ దిశగా రూ. 33 కోట్లతో పను లు వేగవంతంగాపెంచి రోజూవారీగా దృష్టి సారిస్తామని, వైద్యులు, సిబ్బందిని పెంచడం, ఆధునాతన చికిత్స పరికరాలు, మౌలిక వసతుల ఏర్పాటు వంటివి రోగులకు అందుబాటులోకి తేస్తామని పేర్కొన్నారు.

సర్కార్ ఆసుపత్రుల అభివృద్ధి సంకల్పమని, ప్రై వేట్ కార్పొరేట్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దుతున్నామని, ఈ దిశగా నాలుగు మెడికల్ టవ ర్లు ఏర్పాటు చెప్పారు. తెలంగాణలో కేవలం ఐదు ప్రభుత్వ వైద్య ప్రస్తుతం వీటి సంఖ్య 21కి పెంచామని వివరించారు. ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, డిఎంఈ ప్రొ. రమేశ్ రెడ్డి, నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ, రాష్ట్ర శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, నాంపల్లి ఎంఎల్‌ఎ జాఫర్ హుస్సేన్, తెలంగాణ ప్రభుత్వ వైద్యు ల సంఘం అధ్యక్షుడు డా. లాలూప్రసాద్ రాథోడ్, అసోసియోట్ ప్రొ. బి.నరహరి, నాంపల్లి నియోజకవ ర్గం టిఆర్‌ఎస్ ఇన్‌చార్జి సిహెచ్ ఆనందకుమార్ గౌడ్, ఓపెన్ ట్యాక్స్ ఎండీ ఐసాక్ రాజకుమార్, హైసీ అధ్యక్షుడు భరణికుఆమర్ , మనిషా సబూ, మయుర్, అబ్దు ల్ వహీద్‌లు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News