Saturday, April 27, 2024

10 వేలకు తగ్గిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

10929 new covid-19 cases reported in india

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ముందు రోజుకంటే 14 శాతం మేర తగ్గి 10 వేలకు పడిపోయాయి. శుక్రవారం 8 లక్షలకు పైగా పరీక్షలు చేయగా, 10,929 కొత్త కేసులు బయటపడ్డాయి. 392 మరణాలు నమోదయ్యాయి. గత ఏడాది ప్రారంభం నుంచి 3.43 కోట్ల మందికి పైగా కరోనా బారిన పడ్డారు. శుక్రవారం 12,509 మంది కొవిడ్ నుంచి కోలుకోగా, ఇప్పటివరకు 3.37 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.23 శాతంగా కొనసాగుతోంది. గత కొద్ది కాలంగా క్రియాశీల కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రస్తుతం 1,.46,950 మంది వైరస్‌తో బాధ పడుతున్నారు. క్రియాశీల రేటు 0.43 శాతానికి తగ్గింది. కొద్ది రోజులుగా కేరళ కరోనా మరణాల సంఖ్యను సవరిస్తోంది. దాంతో మరణాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం 992 మరణాలు నమోదు కాగా, అందులో 314 కేరళ లోనివే. మొత్తంగా 4 లక్షల 60 వేల మరణాలు సంభవించాయి. టీకా పంపిణీకి సంబంధించి శుక్రవారం 20.75 లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా 107.92 కోట్లకు పైగా డోసుల పంపిణీ అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News