Monday, May 6, 2024

యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా

- Advertisement -
- Advertisement -
11 lakh metric tonnes of urea need for Yasangi

 

గతం కంటే ఈసారి 30 శాతం పెరిగే అవకాశం
అవసరాల మేరకు సహకరించండి.. కేంద్రానికి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్ : యాసంగికి 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గత యాసంగి సాగు లెక్కల ప్రకరాం 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించింది. తెలంగాణ పెరిగిన సాగునీటి వసతులు, ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా గత యాసంగి కంటే ఈసారి 30 శాతం సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ తెలిపింది. గత యాసంగిలో 53.82 లక్షల ఎకరాలలో సాగు నమోదైంది. మొత్తం సాగులో యూరియా అధికంగా వినియోగించే వరి, మొక్కజొన్న ఉద్యాన పంటలే 80 శాతం ఉంటాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం పంటల కన్నా యాసంగి పంటలలో యూరియా అధికంగా వినియోగం అవుతుందన్నారు.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించాలని మంత్రి కేంద్రాన్ని కోరారు. గత ఏడాది 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయింపులకు గాను 7.63 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వినియోగమైనట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు గాను 2 లక్షల మెట్రిక్ టన్నులు పెంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందన్నారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాతో పాటు 1.2 లక్షల మెట్రిక్ టన్నుల డిఎపి, 1.1 లక్షల మెట్రిక్ టన్నుల పొటాష్, 50 వేల మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్పెట్, 5.5 లక్షల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులతో కలిపి 18.30 లక్షల మెట్రిక్ టన్నులను కేంద్రం ఎరువులను కేటాయించింది. కేటాయింపులకు అనుగుణంగా సరఫరా చేయాలని, అదనంగా అవసరాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసే విజ్ఞప్తికి సహకరించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. తప్పకుండా సహకరిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News