Wednesday, May 8, 2024

రాష్ట్రంలో 11కు చేరిన కరోనా అనుమానిత కేసులు

- Advertisement -
- Advertisement -

coronavirus

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా అనుమానిత కేసులు 11కు చేరాయి. ఇదివరకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్లు ముగ్గురిని గుర్తించి ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందించి డిశ్చార్జ్ చేయగా, నగరంలో మరో ఇద్దరు కరోనా వైరస్ అనుమానితులను గుర్తించి, వారికి గాంధీ, ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా కరోనా వైరస్ అనుమానితులు 11కు చేరారు.

ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు పెంచానలి వైద్యాధికారులు నిర్ణయించారు. గాంధీ, ఫీవర్, ఛెస్ట్ ఆసుపత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశారు. అదనంగా సరోజినిదేవి కంటి ఆసుపత్రిలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నగరంలోనే కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స అందించేలా ప్రభుత్వం సన్నద్దమవుతోంది. కరోనా వైరస్ కిట్లు పంపాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కరోనా పరీక్ష కేంద్రం రెండు రోజుల్లో ఏర్పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది.

11 suspected cases of coronavirus reported in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News