Sunday, April 28, 2024

వచ్చే నెల నుంచి ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్స్‌ ఎగ్జిబిషన్‌

- Advertisement -
- Advertisement -

11th Edition of International Plastics Exhibition begins from Sep

హైదరాబాద్‌: పదకొండవ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్స్‌ ఎగ్జిబిషన్‌, కాన్ఫరెన్స్‌, కన్వెన్షన్‌ను వచ్చే నెల నుంచి నిర్వహిస్తున్నట్లు ప్లాస్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ ప్రకటించింది. 2022 సెప్టెంబర్‌ 1 నుంచి 2023 ఫిబ్రవరి 5వరకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ప్లాస్ట్‌ ఇండియా 2023ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది. ప్లాస్ట్‌ ఇండియా–2023 ప్రధానంగా ఆవిష్కరణలు, స్ధిరత్వం, వృద్ధిపై దృష్టి సారించడంతో పాటుగా స్వచ్ఛమైన వాతావరణం నిర్వహించడంలో తోడ్పడే ఆధునిక సాంకేతికతలకు సైతం తోడ్పాటునందించడం ద్వారా నిలకడగా ఆర్ధికాభివృద్ధికి సైతం తోడ్పడటం లక్ష్యంగా చేసుకుంది.

గౌరవనీయ తెలంగాణా రాష్ట్ర పురపాలక పరిపాలన, నగరాభివృద్ధి, వాణిజ్యం, పరిశ్రమలు, ఐటీ, ఎలకా్ట్రనిక్స్‌, కమ్యూనికేషన్ల శాఖామాత్యులు కె టీ రామారావు 11వ ఎడిషన్‌ ప్రదర్శన కోసం సందర్శకుల యాప్‌ ప్లాస్ట్‌ఇండియా 2023ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు ఎవరైనా సరే ఈ యాప్‌ను వినియోగించి ఎగ్జిబిషన్‌ సందర్శనకు నమోదుచేసుకోవచ్చు. ఈ యాప్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణా రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్‌ రంజన్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ప్లాస్టిక్స్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసొసియేషన్‌(టీఏఏపీఎంఏ) అధ్యక్షుడు విమలేష్‌ గుప్తా పాల్గొన్నారు.

ప్లాస్ట్‌ఇండియా 2023 ఎగ్జిబిషన్‌ దాదాపు 150 ఎకరాల విస్తీర్ణంలోని ఎగ్జిబిషన్‌ ప్రాంగణంలో ఉంటుంది. ఇది ప్రగతి మైదాన్‌లో దాదాపు 4.2 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ కార్యక్రమానికి అపూర్వమైన స్పందన లభించింది. ఇప్పటికే ఈ ఎగ్జిబిషన్‌ ప్రాంగణంలో అధిక భాగం విక్రయించబడింది. ప్రపంచవ్యాప్తంగా 2000 మంది ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులు మరియు సాంకేతికతను ప్రదర్శించనున్నారు. ప్రగతి మైదాన్‌లో హాల్స్‌ 2,3 మరియు 5లను ఈ ఎగ్జిబిషన్‌ కోసం బుక్‌ చేశారు. ఇవి ఇప్పటికే అందుబాటులో ఉండగా, హల్స్‌ 6, 14లు కార్యక్రమానికి ముందు సిద్ధం కానున్నాయి. పాత ప్రగతి మైదాన్‌లోని హాల్స్‌ సైతం ఈ ప్రదర్శన కోసం బుక్‌ చేయబడ్డాయి.

ఇండియన్‌ ప్లాస్టిక్స్‌ పరిశ్రమ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. గత మూడు దశాబ్దాలలో ఉత్పత్తి, వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. నేడు, భారతదేశంలో ప్లాస్టిక్‌ ఉత్పత్తి సంస్ధల ప్రధాన లక్ష్యం, ఎగుమతులకు గణనీయంగా తోడ్పాటునందించడం, ప్రపంచంలో అత్యధికంగా ప్లాస్టిక్స్‌ ఉత్పిత్తి చేసే దేశంగా ఇండియాను నిలపడం. భారతదేశపు ప్లాస్టిక్స్‌ ఎగుమతులు 2020–21లో 12.6 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఇది 2025 నాటికి 25 బిలియన్‌ డాలర్లుకు చేరుకుంటుందని అంచనా.

తెలంగాణలో ప్లాస్టిక్‌ పరిశ్రమ పరంగా చూస్తే 10వేల యూనిట్లు దాదాపు 20 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధిని అందిస్తూ భారతదేశపు వృద్ధి కథకు గణనీయంగా తోడ్పాటునందిస్తున్నాయి. దాదాపు 7500 కోట్ల రూపాయల టర్నోవర్‌ తెలంగాణాలోని ప్లాస్టిక్‌ పరిశ్రమ చేస్తుండటంతో పాటుగా 2014 నుంచి 100%వృద్ధిని నమోదు చేసింది. గత దశాబ్ద కాలంలో తెలంగాణా ప్రభుత్వ అత్యద్భుతమైన కార్యక్రమాలు, పరిశ్రమ అనుకూల విధానాలు, అవాంతరాలు లేని విద్యుత్‌ వంటివి ఈ వృద్ధికి తోడ్పడ్డాయి. మిషన్‌ భగీరధ మొదలుకుని అన్ని ప్రభుత్వ కార్యక్రమాలలోనూ మద్దతునందించడంలో ప్లాస్టిక్స్‌ అత్యంత కీలకమైన పాత్ర పోషించాయి.

ఈ సందర్భంగా ప్లాస్ట్‌ఇండియా ఫౌండేషన్‌ అధ్యక్షులు శ్రీ జిగేష్‌ దోషి మాట్లాడుతూ.. ‘‘ తెలంగాణాలో ప్లాస్టిక్స్‌ పరిశ్రమ సాధించిన అసాధారణ వృద్ధి ఈ రంగానికి ఉన్న అసాధారణ సామర్ధ్యంకు ప్రతీకగా నిలిచింది. రాష్ట్రప్రభుత్వంతో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు మేము ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. తద్వారా ప్లాస్టిక్స్‌ను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటుగా పర్యావరణం మరియు ఆర్ధిక వ్యవస్థకు తోడ్పాటునందించే వినూత్నమైన, ఆధునిక తయారీ సాంకేతికతలను అభివృద్ధి చేయనున్నాం’’ అని అన్నారు.

గత కొద్ది సంవత్సరాలుగా ప్లాస్టిక్స్‌ పరిశ్రమ, అత్యాధునిక ఆవిష్కరణలతో తమను తాము పునరావిష్కరించడంతో పాటుగా పర్యావరణ అనుకూల ప్రాసెసింగ్‌ను అభివృద్ధి చేసింది మరియు పర్యావరణంపై ప్రభావం చూపని సాంకేతికతలను వినియోగిస్తుంది. ప్లాస్ట్‌ఇండియా 2023 ఆవిష్కరణతో, ఈ ఫౌండేషన్‌ 10 లక్ష్యాలను పంచుకోవడంతో పాటుగా ప్లాస్టిక్స్‌ పరిశ్రమకు గణనీయంగా తోడ్పాటునందిస్తుందిః

· ప్లాస్టిక్స్‌ తయారీ పరంగా ప్రపంచవ్యాప్తంగా నెంబర్‌ 1 కేంద్రంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడం
· భారతీయ ప్లాస్టిక్స్‌ పరిశ్రమకు వృద్ధికి తోడ్పాటునందించడం
· దేశ ఆర్ధిక వ్యవస్ధకు తగిన సాధికారితనందించేలా ఉపాధి అవకాశాలను సృష్టించడం
· ప్లాస్టిక్స్‌ కోసం భారతదేశాన్ని గ్లోబల్‌ సోర్సింగ్‌ కేంద్రంగా తీర్చిదిద్దడం
· నూతన ఆవిష్కరణల సాంకేతికతలను ప్రోత్సహించడం
· భారతీయ ప్లాస్టిక్స్‌ పరిశ్రమ కోసం సాంకేతికంగా నైపుణ్యం కలిగిన మానవవనరులను వృద్ధి చేయడం.
· ప్లాస్టిక్స్‌ ఎగుమతులను వృద్ధి చేయడం
· ప్లాస్టిక్‌ పరిశ్రమ ప్రాసెసింగ్‌ సామర్థ్యం వృద్ధి చేయడం
· అంతర్జాతీంగా పలు సంస్ధలు ఒడిసిపట్టుకునే రీతిలో అవకాశాలను ప్రదర్శించడం
· ప్లాస్టిక్స్‌ పరిశ్రమ మరియు ప్లాస్టిక్స్‌ వినియోగం కోసం అంతర్గతంగా కనెక్ట్‌ అయిన రంగాల కోసం వృద్ధికి ఉత్ర్పేరకంగా పనిచేయడం

ప్లాస్ట్‌ఇండియా 2023 నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ శ్రీ అజయ్‌ షా మాట్లాడుతూ ‘‘ భారతీయ ప్లాస్టిక్‌ పరిశ్రమ ఇప్పుడు ప్రాసెసింగ్‌, టూల్స్‌ మరియు ప్లాస్టిక్‌ ఉత్పత్తుల సరఫరాదారులు, ప్లాస్టిక్‌ వ్యర్థ నిర్వహణ మరియు రీసైక్లింగ్‌ ఎక్విప్‌మెంట్‌ తో పాటుగా పునరుత్పాదక శక్తి, కృత్రిమ మేథస్సు మరియు రోబోటిక్స్‌ యొక్క నూతన రంగాలకు అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. భారతీయ ప్లాస్టిక్‌ పరిశ్రమ వృద్ధికి తోడ్పాటునందించడం లక్ష్యంగా చేసుకుని ప్రపంచ శ్రేణి ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా నూతన ఉత్పత్తుల ఆవిష్కరణలకు తగిన వేదికలను బ్రాండ్లకు అందించడంతో పాటుగా వారి నెట్‌వర్క్‌ను వృద్ధి చేయడం, నూతన సాంకేతికతలను అభ్యసించడం మరియు అంతర్జాతీయ స్థాయిలో ఆలోచనలను మార్పిడి చేయడం ఉన్నాయి’’ అని అన్నారు.

‘‘తెలంగాణాలో ప్లాస్టిక్‌ పరిశ్రమ వృద్ధి చెందేందుకు అపార అవకాశాలున్నాయి. ప్లాస్ట్‌ఇండియా 2023 ఇప్పుడు తెలంగాణాలోని ఎగ్జిబిటర్లకు ఓ వేదికను సృష్టించడంతో పాటుగా వారి ఉత్పత్తులు మరియు సాంకేతికతలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఈ ప్రదర్శన కేవలం ప్లాస్టిక్‌ పరిశ్రమకు సంబంధించిన ఎగ్జిబిటర్లను మాత్రమే ఏకతాటిపైకి తీసుకురావడం కాకుండా ప్లాస్టిక్‌ పరిశ్రమకు సంబంధించి విభిన్న రంగాల సందర్శకులను సైతం ఒకే దరికి తీసుకురావడంతో పాటుగా నూతన సాంకేతికతలు, పరిశ్రమలో ఆవిష్కరణలను ప్రదర్శించడం చేయనుంది. అంతర్జాతీయ మరియు జాతీయ డెసిషన్‌ మేకర్లతో అనుసంధానమయ్యే అత్యద్భుతమైనఅవకాశాన్ని అందించడంతో పాటుగా నూతన ఉత్పత్తులను ప్రదర్శించే అత్యద్భుతమైన వేదికగానూ నిలువనుంది’’ అని శ్రీ అజయ్‌ షా అన్నారు.

పదకొండవ ఎడిషన్‌ ప్లాస్ట్‌ఇండియా 2023 ఎగ్జిబిషన్‌ 01 ఫిబ్రవరి నుంచి 05 ఫిబ్రవరి 2023 వరకూ నూతనంగా నిర్మించిన అత్యాధునిక అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ సెంటర్‌, ప్రగతి మైదాన్‌, న్యూఢిల్లీ, ఇండియా వద్ద జరుగనుంది. ఈ ప్రదర్శన ఎగ్జిబిటర్లకు ప్రాసెసింగ్‌, మెషినరీ, మౌల్డ్స్‌, డైలు, ఆక్జిలరీ యంత్రసామాగ్రి, ప్రింటింగ్‌ మరియు ప్యాకేజింగ్‌, ముడి పదార్ధాలు మరియు మరెన్నో అంశాలలో నూతన ఆవిష్కరణలను ప్రదర్శించే అవకాశం కల్పిస్తోంది.

11th Edition of International Plastics Exhibition begins from Sep

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News