Saturday, April 27, 2024

పోలీసుల వైఖరికి నిరసనగా మతం మారిన దళితులు

- Advertisement -
- Advertisement -

12 members of Dalit family convert to Buddhism

కోట(రాజస్థాన్): తమ కుటుంబ సభ్యుడు ఒకరిపై జరిగిన దాడి కేసులో గ్రామ సర్పంచ్ భర్తపై కేసు నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో మనస్థాపం చెంది రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో ఒక దళిత కుటుంబానికి చెందిన 12 మంది బౌద్ధ మతంలోకి మారిపోయారు. బాప్చా పోలీసు స్టేషన్ పరిధిలోని భులోన్ గ్రామానికి చెందిన రాజేంద్ర తన 12 మంది కుటుంబ సభ్యులతో కలసి శుక్రవారం బౌద్ధమతం స్వీకరించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు. బౌద్ధ మతం స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసిన అనంతరం వారు హిందూ దేవతల విగ్రహాలను, ఫోటోలను గ్రామ సమీపంలోని బైత్లీ నదిలో పారవేసినట్లు ఆయన చెప్పారు. దేశంలో ప్రతి ఒక్కరికి తమ మతాన్ని ఎంచుకునే స్వేచ్ఛ ఉందని ఆయన తెలిపారు. రాజేంద్ర కుటుంబం తప్ప గ్రామం మరెవరూ మతం మారలేదని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News