Friday, April 26, 2024

మూడు వేలు దాటిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

129 New Corona Cases

 

వందకు చేరువలో మరణాలు

కొత్తగా 129 కేసులు నమోదు.. మరో ఏడుగురు మృతి
రాష్ట్రానికి చెందిన 127 మందికి, ఇద్దరు వలస కార్మికులకు వైరస్
జిహెచ్‌ఎంసిలో 108, జిల్లాల్లో 21 మందికి సోకిన కోవిడ్
34 మంది జూనియర్ వైద్యులకు పాజిటివ్
3020కు చేరిన కరోనా బాధితుల సంఖ్య
గాంధీలో ఐదుగురు రోగులకు ప్లాస్మాథెరఫీ చికిత్స

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసులు మూడు వేలు దాటగా, కరోనా మరణాలు వందకు చేరువయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఆందోళన నెలకొంది.

బుధవారం కొత్తగా 127 కేసులు నమోదు కాగా, ఏడుగురు వ్యక్తులు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. దీనిలో జిహెచ్‌ఎంసిలో 108, రంగారెడ్డి 6, ఆసిఫాబాద్ 6, మేడ్చల్ 2, సిరిసిల్లా 2, యాదాద్రి, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కోక్క కేసు చొప్పున నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ను విడుదల చేసింది. అయితే మరణించిన వారి పూర్తి వివరాలు బులిటెన్‌లో పేర్కొనలేదు. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 3020కి చేరగా, వీటిలో రాష్ట్రానికి చెందిన కేసులు 2572 ,ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు 448 మంది ఉన్నారు.

ఇప్పటి వరకు వైరస్ బారి నుంచి పూర్తిగా కోలుకోని ఆరోగ్యవంతులుగా 1556 మంది ఇళ్లకు చేరగా, ప్రస్తుతం ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో 1365 మంది చికిత్స పొందుతున్నారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు 99 మంది మృతి చెందినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నారు. అయితే ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు కరోనా కలవరం పెడుతుండటంతో ప్రజలతో పాటు అధికారుల్లో కూడా ఆందోళనలు నెలకొన్నాయి. కోవిడ్ పోరులో ముందు వరుసలో పనిచేస్తున్న వైద్యులతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులకు వైరస్ సోకడం ఆయా వర్గాల్లో భయాందోళలను రేకెత్తిస్తున్నాయి. బుధవారం ముగ్గురు తెలుగు మీడియా ప్రతినిధులకూ వైరస్ తేలినట్లు సమాచారం.

ఐదుగురు వ్యక్తులకు ప్లాస్మాథెరఫీ ప్రయోగం
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగుల్లో ఐదుగురు వ్యక్తులకు ప్లాస్మాథెరపీ ప్రయోగించినట్లు అధికారులు తెలిపారు. పి 1311, పి 1647, పి 2415, పి2639 రోగులకు ఐసిఎంఆర్ నిబంధనలు పాటిస్తూ ప్లాస్మా ఎక్కించినట్లు వైద్యశాఖ తెలిపింది. వీరంతా అప్పటికే వెంటిలేటర్స్‌పై చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో వీరిపై ప్లాస్మా ప్రయోగం చేశామని వైద్యాధికారులు స్పష్టం చేశారు.

ఇద్దరు వ్యక్తుల డోనేట్ చేసిన ప్లాస్మాని ఐదు మందికి ఎక్కించామని గాంధీ అధికారులు తెలిపారు. అయితే ప్రస్తుతం వీరిలో పి 1311 రోగి ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, మరో ముగ్గురు ఆక్సిజన్ మీద చికిత్స పొందుతున్నారని, మరో వ్యక్తికి సాధారణ చికిత్స కొనసాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో పాటు కోవిడ్ రోగుల డయాలసిస్ కోసం 75 సైకిల్స్‌ను అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.

129 New Corona Cases Reported in Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News