Saturday, May 4, 2024

దేశంలో కరోనా ఉగ్రరూపం.. ఒక్కరోజే లక్షా 45వేల కేసులు

- Advertisement -
- Advertisement -

24గంటల్లో 1,45,384 కేసులు
10 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
5 రాష్ట్రాల్లో 72.23 శాతం
న్యూఢిల్లీ: దేశంలో శనివారం 8 గంటల వరకల్లా 24 గంటల్లో 1,45,384 కేసులు, 794 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,32,05,926 కాగా, మరణాల సంఖ్య 1,68,436కి చేరింది. మరణాల రేట్ 1.28శాతంగా నమోదైంది. కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 58,993, చత్తీస్‌గఢ్‌లో 11,447, ఉత్తర్‌ప్రదేశ్‌లో 9587 నమోదయ్యాయి. ప్రస్తుతం కోలుకున్నవారి సంఖ్య 1,19,90,859. దాంతో, రికవరీ రేట్ 90.80 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 10,46,631. దాంతో,యాక్టివ్ రేట్ 7.93 శాతంగా నమోదైంది. యాక్టివ్ కేసుల్లో 72.23 శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనేనన్నది గమనార్హం. యాక్టివ్ కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 51.23 శాతం నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో చత్తీస్‌గఢ్, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, కేరళ ఉన్నాయి. ఆరున్నర నెలల తర్వాత యాక్టివ్ కేసులు 10లక్షల మార్క్ దాటినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
శుక్రవారం 11,73,219మందికి పరీక్షలు నిర్వహించారు. దీంతో, మొత్తం పరీక్షల సంఖ్య 25,52,14,803కు చేరింది. 24 గంటల్లో మొత్తం మరణాలు 794 కాగా, వీటిలో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 301, చత్తీస్‌గఢ్ నుంచి 91, పంజాబ్ నుంచి 56, కర్నాటక నుంచి 46, గుజరాత్ నుంచి 42, ఢిల్లీ నుంచి 39, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 36, రాజస్థాన్ నుంచి 32, తమిళనాడు, మధ్యప్రదేశ్ నుంచి 23 చొప్పున, కేరళ నుంచి 22, జార్ఖండ్ నుంచి 17, హర్యానా, ఆంధ్రప్రదేశ్ నుంచి 11 చొప్పున నమోదయ్యాయి.

145384 New Corona Cases reported in India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News