Friday, April 26, 2024

రాష్ట్రంలో కొత్తగా 156 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -
156 new covid cases reported in telangana
విదేశాల నుంచి వచ్చిన వారిలో 8 మందికి కొవిడ్ పాజిటివ్

హైదరాబాద్ : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 33,140 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 156 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,79,720కు పెరిగింది. తాజాగా 207 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,72,063 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 98.87 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,642 యాక్టివ్ కేసులున్నాయి.

రాష్ట్రంలో ప్రస్తుతం 20 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. ఆదివారం విదేశాల నుంచి 658 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో ఎనిమిది మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. దీంతో వారి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు రిస్క్ దేశాల నుంచి 8,396 మంది విదేశీ ప్రయాణికులు రాష్ట్రానికి రాగా, వారిలో 16 మందికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.అలాగే నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన నలుగురికి కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. మరో 15 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News