Wednesday, May 15, 2024

జగత్గిరిగుట్టలో సంవత్సరంన్నర బాలుడికి కరోనా..

- Advertisement -
- Advertisement -

Corona

 

హైదరాబాద్: నగరంలోని జగత్గిరిగుట్టలో మహమ్మారి కరోనా వైరస్ కలకలం రేపుతోంది. జగత్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో పాజిటివ్ కేస్ నమోదు అయ్యింది. కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియా చంద్రగిరి నగర్ లో సంవత్సరంన్నర వయసున్న ఓ బాలుడికి కరోనా వైరస్ సోకింది. ఇటీవల కరోనాతో చనిపోయిన వ్యక్తి నుంచి మనుమనికి వైరస్ సోకినట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు‌‌ ఆ బాలుడిని చికిత్స నిమిత్తం క్యారంటైన్ కు తరలించారు.

18 Month old boy tests positive for Corona in Hyd

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News