Friday, May 3, 2024

20 మంది ఇండియన్ నేవీ సిబ్బందికి కరోనా పాజిటీవ్..

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ భారత్ లోనూ విజృంభిస్తుంది. ఇప్పటికే దేశంలో కరోనా బాధితుల సంఖ్య 14 వేలు దాటగా, మృతుల సంఖ్య 496కు చేరింది. తాజాగా భారత నేవీలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ముంబయిలోని ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్‌ స్థావరంలో ఉన్న దాదాపు 20 మంది నేవీ సిబ్బందికి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. దీంతో వారిని ముంబయిలోని ఐఎన్ హెచ్ఎస్ అశ్విని నేవీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఐఎన్‌ఎస్‌ అంగ్రేలో కరోనా వ్వాప్తి అరికట్టేందుకు.. ఈ వైరస్ సోకిన వారిని ఎవరెవరు కలిసారోనని అధికారులు ఆరా తీస్తున్నారు. కాగా, ఏప్రిల్‌ 7న ఐఎన్‌ఎస్‌ అంగ్రే నావెల్‌ స్థావరంలో ఒకరికి కరోనా పాజిటీవ్ వచ్చింది. అతన్ని నుంచి మిగతా వారికి కరోనా సోకినట్లు నేవీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

20 Indian Navy personnel test positive for Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News