Monday, April 29, 2024

ముంబయిలో విషాదం.. ఊపిరాడక ముగ్గురు పారిశుధ్య కార్మికులు మృతి

- Advertisement -
- Advertisement -

 

ముంబయి: నగరంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మురుగునీటి ట్యాంక్ లోకి దిగిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు ఊపిరాడకపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని విరార్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ బంగ్లాలో యజమాని పర్యావేక్షణలో నలుగురు కార్మికులు సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేసేందుకు అందులోకి దిగారు. ఈ క్రమంలో విష వాయువులను పీల్చుకున్న నలుగురు అస్వస్థతకు గురికావడంతో యజమాని వారిని పైకి లాగి చికిత్స నిమిత్తం దగ్గరలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు కార్మికులు చనిపోయినట్లు వైద్యులు స్పష్టం చేశారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తున్న కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించిన యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

3 Sanitation Workers suffocated to death in Mumbai

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News