Monday, May 6, 2024

విస్తరిస్తున్న భారతీయ సంతతి ప్రతిభ

- Advertisement -
- Advertisement -

200 Indian-origin persons occupy leadership positions in 15 countries

 

15 దేశాల్లో ఉన్నత పదవుల్లో 200 మందికి పైగానే
వీరిలో 60 మందికి పైగా కేబినెట్ పదవుల్లో
తొలి సారిగా జాబితా రూపొందించిన అమెరికా సంస్థ ఇండియాస్పోరా

వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా భారతీయ సంతతికి చెందిన వారు 15 దేశాల్లో నాయకత్వ పదవులలో ఉన్నారు. అగ్రరాజ్యాలైనా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. భారతీయ సంతతి వారి కోసం పని చేసే అమెరికాకు చెందిన ఓ సంస్థ మొట్టమొదటి సారిగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి. సోమవారం ‘ ది 2021ఇండియాస్పోరా గవర్నమెంట్ లిస్ట్’పేరిట విడుదల చేసిన ఈ జాబితాను విడుదల చేశారు. వివిధ రంగాల్లో భారతీయ సంతతికి చెందిన వారు సాధించిన విజయాలను బయటి ప్రపంచానికి తెలియజేయడం కోసం రూపొందించిన ఈ నివేదికలోని వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్లు, ఇతర ప్రజలకు అందుబాటులో ఉన్న వాటినుంచి సేకరించి క్రోడీకరించారు. 15 దేశాల్లో 200 మందికి పైగా భారతీయ వారసత్వానికి చెందిన నాయకులు ఉన్నత పదవులను అలంకరించారని, వీరిలో 60 మందికి పైగా కేబినెట్ పదవుల్లో ఉన్నారని ఆ నివేదిక తెలిపింది.‘ ‘ప్రపంచంలో అత్యంత పురాతనమైన ప్రజాస్వామ్యంలో ఉపాధ్యక్షురాలుగా తొలి మహిళ, తొలి నల్లజాతికి తొలి వ్యక్తి ఉండడం ఎంతో గర్వకారణం.

భారతీయ సంతతికి చెందిన పలువురి గురించి తెలియజేయడానికి ప్రెసిడెంట్స్ డే నాడు మేము ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాం’ అని సిలికాన్ వ్యాలీకి చెందిన పారిశ్రామికవేత,్త ఈ సంస్థ వ్యవస్థాపకుడు ఎంఆర్ రంగస్వామి అన్నారు. అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌నేద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నాయకుడు బావి తరాలకు ఒక వారసత్వాన్ని నిర్మిస్తున్నారు. అలాగే మా వర్గానికే కాకుండా సేవలు అందిస్తున్న ఇతర భాగస్వాములు, వర్గాలకు కూడా దీన్ని విస్తరిస్తున్నారు’ అని ఆయన అన్నారు. భారత దేశంనుంచి వలస వెళ్లి చెప్పుకోదగిన చరిత్ర కలిగిన ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, దక్షిణాఫ్రికా, యుఎఇ, బ్రిటన్, అమెరికా లాంటి దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, చట్టసభల ప్రతినిధులు, కేంద్ర బ్యాంకుల అధిపతులు, సీనియర్ సివిల్ అధికారులులాంటి వారున్నారు. ‘ ఈ జాబితాలో చోటు సంపాదించుకోవడం ఒక గౌరవంగా భావిస్తున్నాను.

అమెరికా కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం సేవలందించిన భారతీయ అమెరికన్‌గా, అమెరికా జీవనంలో సమాజంలో విడదీయలేని భాగంగా మారిన భారతీయ సంతతికి చెందిన నాయకురాలుగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను’ అని అమెరికా కాంగ్రెస్ సభ్యులు, ప్రతినిధుల సభలో ఆసియా వ్యవహారాలపై విదేశీ వ్యవహారాల ఉపసంఘం చైర్మన్ అమి బేరా అన్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారతీయ సంతతికి చెందిన వారు 3.2 కోట్ల( 32 మిలియన్ల)కు పైగా ఉన్నారు. ప్రపంచంలోనే ప్రవాసుల్లో ఇది అత్యధిక సంఖ్య కావడం గమనార్హం. ఈ జాబితాలో ఉన్న భారతీయ అధికారులుకలిసి 58.7 కోట్లకు పైగా భాగస్వాములకు (వర్గాలు) ప్రాతినిధ్యం వహిస్తుండడంతో పాటుగా వారి దేశాల జిడిపిలో 28లక్షల కోట్ల డాలర్లకు పైగా ఆదాయాన్ని అందజేస్తున్నారు. తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సమాజాలు పురోగమించడానికి భారతీయ సంతతికి చెందిన వారు ప్రభుత్వ నేతలు గణనీయంగా తమవంతుసేవలందిస్తుండడం నిజంగా గర్వకారణం’ అని ఫిజీ విద్య, వారసత్వం, కళల శాఖ మంత్రి రోసీ అక్బర్ అన్నారు.

ఈ జాబితాలో భారత్‌నుంచి వలస వెళ్లిన వారితో పాటుగా సింగపూర్,దక్షిణాఫ్రికా, బ్రిటన్, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో జన్మించిన వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్ ఉన్నారు. వీరిలో కొంతమంది శరణార్థులుగా, ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వచ్చిన వారు ఉండగా, మరి కొంత మంది విద్యావకాశాలను వెతుకుంటూ వచ్చి ఇక్కడే స్థిరపడిన వారు, తర్వాతి తరాలకు చెందిన వారు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో భారతీయసంతతికి చెందిన వారు ప్రజా జీవితంలోకి అడుగుపెట్టడం స్ఫూర్తిదాయకమని ఇండియాస్పోరా బోర్డు సభ్యుడు, ఒబామా ప్రభుత్వంలో వాణిజ్య శాఖ అసిస్టెంట్ కార్యదర్శిగా పని చేసిన కెపిఎంజి చైర్మన్, సిఇఓ అరుణ్‌కుమార్ అభిప్రాయపడ్డారు .మరింత మంది భారతీయ సంతతికి చెందిన వారు ప్రజా జీవితంలోకి ప్రవేశించడానికి వీరు ఆదర్శమవుతారని తాను ఆశిస్తున్నానని ఆయన అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News