Monday, April 29, 2024

శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు

- Advertisement -
- Advertisement -
200 special TSRTC buses to Sabarimala
ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అద్దె
టిఎస్‌ఆర్‌టిసి ఎండి సజ్జనార్

హైదరాబాద్ : శబరిమలకు 200 ప్రత్యేక బస్సులు నడపనున్న టిఎస్‌ఆర్‌టిసిఎండి సజ్జనార్ తెలిపారు. రాష్ట్రరోడ్డు రవా ణా సంస్థ ప్రతి సంవత్సరం తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి శబరిమల వెళ్లడానికి అద్దె ప్రాతిపదికన ప్రత్యేక బస్సులను నడిపిస్తుండగా, ఈ ఏడాది కూడా 200 బస్సులను నడపాలని సంస్థ నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రత్యేక బస్సులో ఒక గురుస్వామితో పాటు ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠలు, ఒక అటెండర్‌కు ఉచితంగా ప్రయాణించేందుకు అనుమతించాలని అలాగే శబరిమల యాత్రికులకు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ లేకుండా అద్దెకు బస్సులు ఇవ్వాలని సంస్థ నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. శబరిమలకు బుక్ చేసిన ప్రత్యేక అద్దె బస్సును రద్దు చేస్తే దానికి సంబంధించిన ఛార్జీలను కూడా తగ్గిస్తామని ఆయన పేర్కొన్నారు.

దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు

టిఎస్ ఆర్‌టిసి కేరళ రాష్ట్ర అధికారుల సాయంతో పంబా వద్ద స్పాట్ బుకింగ్ ద్వారా బస్సులోని భక్తులకు ఒకే సమయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా దర్శనం చేసుకునే ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకోసం కాల్ సెంటర్ నెం. 040-30102829 ను లేదా సమీప డిపో మేనేజర్‌ను సప్రదించాలని ఎండి సజ్జనార్ పేర్కొన్నారు.

రద్దు ఛార్జీల వివరాలు ఇలా..
రద్దు సమయం ఉన్న ఛార్జీలు సవరించిన ఛార్జీలు

48 గంటల ముందు రూ.1,000 రూ.1,000
24 గంటల నుంచి
48 గం. ముందు వరకు- అద్దె మొత్తంలో10% రూ.5,000
24 గంటల ముందు నుంచి
బయలుదేరే సమయం వరకు- అద్దె మొత్తంలో30% రూ.10,000

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News