Friday, May 10, 2024

ప్రతి కుటుంబానికి ఉచితంగా 20 వేల లీటర్ల మంచి నీళ్లు: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

20000 litters Water distribute to every Family

హైదరాబాద్: ఇవాళ ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత నీటి సరఫరా చేస్తున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్‌లోని రెహమత్‌నగర్ డివిజన్‌లోని ఎస్‌పిఆర్ హిల్స్‌లో ఉచిత మంచి నీటి పథకాన్ని ఐటి మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇండ్ల వద్దకు వెళ్లి లబ్ధిదారులకు జీరో వాటర్ బిల్లులను మంత్రి కెటిఆర్ అందజేశారు. హైదరాబాద్ ప్రతి కుటుంబానికి 20 వేల లీటర్ల మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు. ఇదే హైదరాబాద్‌లో ఒకప్పుడు ఎన్నో తాగు నీటి కష్టాలు ఉండేవన్నారు. హైదరాబాద్ జలమండలి ముందు ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని గుర్తు చేశారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తున్నామని, పేదింటి ఆడ పిల్లల పెండ్లికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం మాది అని, పేద ప్రజలకు మేలు చేయడంతో కెసిఆర్ ప్రభుత్వం ఎక్కడా తగ్గడం లేదని చెప్పారు. చెన్నైకి రైళ్లలో నీటిని తరలించే దుస్థితి మనకు రావొద్దన్నారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో రిజర్వాయర్లు నిర్మించి ప్రజలకు ఉచిత నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, ఎంపి రంజిత్ రెడ్డి, ఎంఎల్‌ఎలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, వివేకానంద్, ముఠా గోపాల్, ఎంఎల్‌సి యెగ్గె మల్లేశం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్ధీన్, సిఎస్ సోమేష్ కుమార్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News