Saturday, May 4, 2024

బ్యాంకులను దోచుకున్న దొంగలు గుజరాత్ వారే: నారాయణ

- Advertisement -
- Advertisement -

27 Gujarat's theft banks in India

మన తెలంగాణ/హై-దరాబాద్: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. కులాల వారీ జనగణనను చేపట్టారని, ఇందులో వారి ఆర్థికపరమైన అంశాలను కూడా పొందుపర్చాలన్నారు. నల్లడబ్బును తెల్లడబ్బుగా మార్చే క్రమంలో బిజెపికి రెండున్నర లక్షల కోట్ల రూపాయల షేర్ ఉన్నదని విమర్శించారు. ఒకవైపు ఆర్థిక మాంధ్య, మరో వైపు మతోన్మాదం దేశానికి ప్రమాదకరంగా మారుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరబాద్ మగ్దూం భవన్‌లో గురువారం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్న చంద్రశేఖర్ సభాధ్యక్షత వహించారు. సమావేశ ఏజెండాను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రవేశపెట్టారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి సమావేశం కొద్ది సేపు మౌనం పాటించింది. ఈ సమావేశంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపి సయ్యద్ అజీజ్ పాషా హాజరయ్యారు. ఈ సమావేశంలో నారాయణ ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని మోడీ పరువు తగ్గిపోతుందన్నారు. ప్రజలకు చెందిన ఆస్తులను మోడీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారని, పోర్ట్ ఎయిర్ అధానికి, వ్యవసాయ రంగం రిలయన్స్‌కి అప్పగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రిటేల్ అవినీతికి పాల్పడితే, బిజెపి హోల్ అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు.

బ్యాంకులను దోచుకున్న వారిలో 27 మంది దొంగలు గుజరాత్ వారే ఉన్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక దొంగ చేతిలో పెట్టినా రూ.2.5 లక్షల కోట్లు వస్తాయని, కానీ దీనిని కేవలం రూ.52 వేల కోట్లకు మాత్రమే అంచనా వేస్తున్నారన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను కూడా రూ.10 లక్షల కోట్లకు గాను కేవలం రూ.34 వేల కోట్లకు అంచనా వేశారని తెలపారు. కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులను లూటీ చేస్తే, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారని, ఇది దేశానికి ప్రమాదకరమని నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గనిస్తాన్ తాలిబన్ల ఘటనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై చర్చించాలన్నారు.

రాష్ట్రాలతో జాతీయ స్థాయి ఐక్యత దెబ్బతినొద్దు

జాతీయ స్థాయిలో 19 రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 20 నుంచి 30 వరకు చేపట్టే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని నారాయణ అన్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు భాగస్వామ్యం కాలేదన్నారు. బిజెపికి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో కొన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మధ్య ఐక్యత కష్టసాధ్యమని, ఆయా రాష్ట్రాలకు చెందిన అంతర్గత సమస్యలను రాష్ట్రస్థాయిలోనే పరిష్కరించుకోవాలని, తద్వారా జాతీయస్థాయి ఐక్యతకు దెబ్బతినబోదని అభిప్రాయపడ్డారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా దయాదాక్షిణ్యాలు ఉన్నంతవరకు ఎపి సిఎం వైఎస్ జగన్ ఎలాంటి ప్రమాదం లేదని, బిజెపికి వ్యతిరేకంగా ఉన్నట్లు మోడీ కంట్లో పడితే ఆయన జైలులో ఉంటారని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News