Wednesday, May 15, 2024

పార్కుల్లో పెళ్ళికాని జంటకు ప్రవేశం లేదు

- Advertisement -
- Advertisement -

unmarried couples are not allowed inside the park

హైదరాబాద్: నగరం రోజుకు రోజుకు కాంక్రీట్ జంగల్ మారుతుండంతో జిహెచ్‌ఎంసి అధికారులు పార్క్‌లను అభివృద్ది చేస్తున్నారు. ప్రతి రోజు ఎంతో మంది తమ దైనందిత కార్యక్రమాలనుంచి కాస్త విరామం కోసం సమీపంలోని పార్కులను ఆశ్రయిస్తూ సేద దీరుతున్నారు. అయితే కొన్ని పార్కుల్లో కొంత మంది యువతీ యువకులు అసభ్య కార్యక్రమాలకు పాల్పడుతుండటంతో అక్కడకు కుటుంబ సమేతంగా వచ్చేవారికి ఇటువంటి దృశ్యాలు కంటబడుతుండటంతో వారు పార్కులకు వచ్చేందుకు జంకుతున్నారు. ఇటుంటి అంశం అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నివారణ చర్యలు చేపట్టారు. వీటిలో భాగంగా అధికారులు ఇందిరా పార్క్‌లోనే కాకుండా హుస్సేన్‌సాగర్‌కు ఆనుకుని సంజీవయ్య పార్కులో కూడా పెళ్ళికాని జంటలకు ప్రవేశం లేదనే బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో ఆయా పార్కుల్లో జరిగే జంటల అసభ్య కార్యక్రమాలకు చెక్ పెట్టడంతో ప్రతి రోజు పార్కులకు వచ్చే వాకర్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

unmarried couples are not allowed inside the park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News