Home జాతీయ వార్తలు మళ్లీ పెరిగిన కరోనా కేసులు

మళ్లీ పెరిగిన కరోనా కేసులు

35662 new covid-19 cases reported in india
మెజార్టీ కేసులు కేరళ లోనే

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారంతో పోలిస్తే తాజాగా 3.6 శాతం మేర పెరిగి కేసులు 35 వేలకు చేరాయని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ వివరించింది. సగానికి పైగా కేసులు ఒక్క కేరళ లోనే నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో నిన్న 23 వేలకు పైగా కేసులు బయటపడగా, 134 మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక మహారాష్ట్రలో 3586 మంది వైరస్ బారిన పడ్డారు. 24 గంటల వ్యవధిలో 35,662 మందికి కరోనా సోకింది. 281 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.34 కోట్లకు చేరగా, 3.26 కోట్ల మంది వైరస్‌ను జయించారు.

శుక్రవారం ఒక్క రోజే 33 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3.4 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి కరోనా కారణంగా 4,44,529 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.02 శాతంగా ఉండగా, రికవరీ రేటు 97.85 శాతానికి చేరింది. శుక్రవారం 14.48 లక్షల మందికి కరోనా నిర్ధారణఱ పరీక్షలు చేశారు. శుక్రవారం ప్రదాని మోడీ పుట్టిన రోజున కరోనా కార్యక్రమం చాలా వేగంగా సాగింది. ఒక్క రోజే 2.5 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి. దాంతో మొత్తం పంపిణీ అయిన డోసుల సంఖ్య 79.42 కోట్లకు చేరింది.