Wednesday, May 1, 2024

రాష్ట్రంలో మరి 40 కేసులు

- Advertisement -
- Advertisement -

40 corona positive cases registered

 

జిహెచ్‌ఎంసి పరిధిలో 33, ఏడుగురు వలస కార్మికులకూ వైరస్, 13 మంది డిశ్చార్జి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 13 మంది డిశ్చార్జ్ అయ్యారు.

శుక్రవారం నమోదైన కేసుల్లో జిహెచ్‌ఎంసి పరిధిలో 33 మంది ఉండగా, మరో 7 మంది వలస కార్మికులకు వైరస్ సోకినట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ల సంఖ్య 1454కు చేరుకుంది. వైరస్ బారిన పడి పూర్తిగా కోలుకొని ఇప్పటి వరకు 959 మంది ఆరోగ్యవంతంగా ఇళ్లకు వెళ్లగా, ప్రభుత్వ నోటిఫైడ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 461 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారిక బులిటెన్‌లో వెల్లడించారు.

ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా వైరస్ దాడిలో 34 మంది మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. శుక్రవారం డిశ్చార్జ్ అయిన వారిలో హైదరాబాద్ నుంచి 11 మంది, వికారాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ఒక్కోక్కరు ఉన్నట్లు తెలిపారు. వైరస్ సోకిన వలస కార్మికుల వివరాలు కూడా వెల్లడించకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా గురువారం డిశ్చార్జ్ సంఖ్య952 ఉండగా శుక్రవారం 13 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో డిశ్చార్జ్‌ల సంఖ్య 965కు చేరుకుంటుంది. కానీ బులిటెన్‌లో మాత్రం 959 ప్రకటించడం ఆశ్చర్యకరం.

14 రోజులుగా 26 జిల్లాల్లో కేసులు నమోదు కాలేదు..

గత 14 రోజులుగా 26 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు. కరీంనగర్, సిరిసిల్లా, కామారెడ్డి, మహబూబ్‌నగర్ , మెదక్, భూపాలపల్లి, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, ములుగు, పెద్దపల్లి, సిద్దపేట్, మహబూబబాద్, మంచిర్యాల్, భద్రాద్రి, వికారాబాద్, నల్గొండ, ఆసిఫాబాద్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట్, నారాయణపేట్, వరంగల్ అర్బన్, జనగాం, గద్వాల్, నిర్మల్ జిల్లాల్లో 14 రోజులుగా కేసులు నమోదు కాలేదని అధికారులు ప్రకటించారు. అయితే ఇతర రాష్ట్రాలు నుంచి తిరిగి వస్తున్న వారికి వైరస్ సోకినా ఈ జిల్లాలు వారిగా పరిగణించకుండా మైగ్రెంట్స్‌గా లెక్కిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News