Sunday, April 28, 2024

మహేష్‌ను గర్వించేలా చేసిన గౌతమ్

- Advertisement -
- Advertisement -

Gautam made Mahesh babu proud

 

కొడుకు పుట్టినప్పుడు కాదు అతడు ఏదైనా సాధించినప్పుడే తండ్రికి అసలైన పుత్రోత్సాహం అని అంటారు. అయితే పుట్టడమే గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడు సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని. తండ్రితో ‘1 నేనొక్కడినే’ సినిమాలో నటించి మంచి మార్కులు కొట్టేసిన గౌతమ్ ఇప్పుడు మంచి వ్యక్తిగా కూడా ఓ మెట్టు ఎక్కాడు. కష్ట కాలంలో ఇతరులకు సాయం చెయ్యడంలో నాన్నకు తీసిపోకుండా అతను తన తండ్రి మహేష్‌ను గర్వపడేలా చేశాడు. ఈ లాక్‌డౌన్ సమయంలో తన స్నేహితులతో కలిసి ‘అక్షయ బంధన’ పేరిట నిరుపేదలకు అవసరమైన నిత్యావసర సరుకులు అందిస్తూ తమ వంతు సాయం చేస్తున్నాడు గౌతమ్. ఈ సంస్థకు గౌతమ్ నాయకత్వం వహించడం గర్వకారణంగా ఉందని మహేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. అలాగే వారు చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలంటే వారి వెబ్‌సైట్ ద్వారా అందజేయవచ్చని తెలిపారు. ఈ కష్టకాలంలో గౌతమ్ ఇలాంటి సేవా కార్యక్రమానికి నిర్వహించడం నిజంగా మహేష్‌కు చాలా గర్వకారణమని చెప్పాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News