Saturday, April 27, 2024

లాక్‌డౌన్‌తో దారిద్య్రంలోకి 40కోట్ల మంది!

- Advertisement -
- Advertisement -

Poverty

 

న్యూఢిల్లీ : కరోనా కట్టడిలో భాగంగా అమలు చేస్తున్న ‘లాక్‌డౌన్’ కారణంగా భారత్‌లో దాదాపు 40 కోట్ల మంది దారిద్య్రంలోకి జారిపోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ కార్మిక సంఘం అంచనా వేసింది. భారతీయులు ఒక్క మార్చి నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా ఉపాధి కోల్పోయారని భారతీయ ఆర్థిక పర్యవేక్షణ కేంద్రం (సిఎంఐఇ) వెల్లడించడం కూడా దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మార్చి నెలాఖరు నాటికి దేశంలో ఉద్యోగుల శాతం 38. 2 శాతానికి, నిరుద్యోగ సమస్య మున్నెన్నడు లేనివిధంగా 8.7 శాతానికి పడిపోయిందని సీఏంఐఈ వెల్లడించింది.

ఏప్రిల్ ఆఖరు నాటికి భారత్‌లోని 50 కోట్ల మంది ప్రజలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా అవుతారని, మరో 50 కోట్ల మంది జేబుల్లో ఆర్థిక నిల్వలు సగానికి పడిపోతాయని ‘లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్’లో సామాజిక, ఆర్థిక సమానత్వంపై సీనియర్ ఫెల్లోషిప్ చేస్తోన్న ఏఈ సురేశ్ అంచనా వేశారు. ప్రపంచంలోని పలు దేశాల తరహాలోనే కరోనా వైరస్ సంక్షోభం బాధితులకు భారత ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా చేయడంతో నేరుగా నగదు చెల్లిస్తోంది. ఆర్థిక నిపుణుల సూచనల మేరకు దీన్ని అమలు చేస్తున్నారని చెప్పవచ్చు. ‘పేదల కోసం తాత్కాలిక ఆదాయ బదిలీ స్కీమ్’ను భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ సూచించగా, ‘అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయ మద్దతు స్కీమ్’ను స్వరాజ్య పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ ఆర్. జగన్నాథన్ సూచించారు.

 

40 crore people in Poverty with Lockdown
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News