Sunday, May 12, 2024

చైనా సైన్యం వెనకకు పోనేలేదు

- Advertisement -
- Advertisement -

40000 China troops still present at LAC

న్యూఢిల్లీ: చర్చలకు అనుగుణంగా చైనా తన సేనలను పూర్తి స్థాయిలో ఉపసంహరించలేదని వార్తాసంస్థలు తెలిపాయి. ఎల్‌ఎసి వెంబడి ఇప్పటికీ చైనా బలగాలు తిష్టవేసుకుని ఉన్నట్లు ఎన్‌డిటివీ తెలిపింది. దాదాపు 40వేల మంది వరకూ చైనా సైనికులు సరిహద్దుల్లోనే తిష్టవేసుకు ఉన్నారని, దీనికి సంబంధించి ఫోటోలు కూడా ఉన్నాయని వార్తాసంస్థలు తెలిపాయి. ప్రత్యేకించి పాంగాంగ్ లేక్ వెంబడి ఫింగర్స్ ప్రాంతంలో, గోగ్రా వద్ద చైనా బలగాలు తిష్టవేసుకుని ఉన్నాయి. ఇటీవలి కాలంలో వరుసగా పలుదఫాల చర్చలు జరుగుతూ వచ్చాయి. సామరస్య స్థాపనకు తమ బలగాలు వెనకకు వెళ్లుతున్నట్లు చైనా ప్రకటించింది. అయితే వారు వెళ్లడం భ్రమ ఇప్పటికీ ఇరుపక్షాల మధ్య కుదిరిన తటస్ట ప్రాంతం అవగావహన స్థలం వద్ద చైనా సేనలు వెళ్లినట్లే వెళ్లి తిరిగి వచ్చినట్లు అనధికారవర్గాల ద్వారా, స్థానికుల కథనాల ద్వారా టీవీఛానల్స్ పసికట్టాయి. కేవలం గాల్వన్ వద్ద చైనా సేనల ఉపసంహరణ జరిగింది. అంతేకానీ గోగ్రా ఇతర చోట్ల చైనా సైన్యం సర్వంసన్నద్ధంగానేఉందని వెల్లడైంది.

భారత్ విదేశాంగ రీతి మారదనే ఆశ: చైనా విదేశాంగ 

భారతదేశం ఇప్పటికీ సొంతం స్వతంత్రమైన విదేశాంగ విధానాన్ని పాటిస్తుందని తాము విశ్వసిన్తున్నట్లు చైనా విదేశాంగ ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇతర దేశాల ప్రలోభాలకు లొంగిపోయి భారతదేశం ఇంతకు ముందటి విదేశాంగ బాట నుంచి దారిమళ్లుతుందని అనుకోవడం లేదని చైనా విదేశీ వ్యవహారాల ప్రతినిధి వాంగ్‌వెన్‌బిన్ చెప్పారు. భారతదేశం విదేశాంగ విధానానికి సంబంధించి ఏ ఇతర వ్యవస్థలు లేదా కూటమిలలో చేరే ప్రసక్తే లేదని భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై చైనా ప్రతినిధి స్పందించారు. గతంలో లాగానే ఇకముందు కూడా భారతదేశం స్వతంత్ర విదేశాంగ పాలసీతో ఉంటుందని చెప్పడం మంచిపరిణామం అని, అయితే ఇతర దేశాల ఒత్తిడితో ఈ దారితప్పుతుందనే అనుమానాలు ఉన్నాయని, అయితే ఈ అనుమానాలు సరికావని తాము భావిస్తున్నట్లు చైనా ప్రతినిధి చెప్పారు. భారతదేశం తమ విదేశాంగ విధానాన్ని అమెరికాకు అనుకూలంగా మల్చుకుంటూ వస్తోందని, దీనితోనే వివాదాలు రగులుకుంటున్నాయని ఇటీవలి కాలంలో చైనా ఆరోపిస్తూ వస్తోంది.

40000 China troops still present at LAC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News