Saturday, April 27, 2024

అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల లోపు 43 లక్షల మంది పిల్లల్లో స్థూలకాయం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశం మొత్తం మీద అంగన్వాడీ కేంద్రాల్లో ఐదేళ్ల వయసున్న 7,24,56,458 మంది పిల్లల్లో ఆరు శాతం అంటే దాదాపు 43,47,387 మంది పిల్లల్లో స్థూలకాయం లేదా ఎక్కువ బరువు లక్షణాలు కలిగి ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గ్రోత్ మోనిటరింగ్ యాప్ “ పోషణ్ ట్రాకర్ ” నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ వివరాలు వెలుగు లోకి వచ్చాయి. ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామీణ పిల్లల సంరక్షణ కేంద్రాలు ( రూరల్ చైల్డ్ కేర్ సెంటర్లు) నుంచి సేకరించిన డేటా కూడా ఇదే విధమైన శాతాన్ని తెలియజేస్తోంది. మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పిల్లల్లో స్థూలకాయం శాతం జాతీయ సగటు ఆరు శాతం కన్నా అధిగమించి ఉందని తేలింది.

201516 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్ 4) కన్నా 201921 నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 5) నాటికి ఈ పరిణామం చాలా ఎక్కువైంది. సిక్కిం, త్రిపుర తరువాత మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము,కశ్మీర్ ప్రాంతాల్లో బరువు ఎక్కువ ఉన్న పిల్లలు అధికంగా కనిపిస్తున్నారు. దీనికి విరుద్ధంగా మధ్యప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో బరువు ఎక్కువ పిల్లలు చాలా తక్కువ శాతంలో ఉన్నారని తేలింది. తమిళనాడు, గోవా తప్ప ప్రతిరాష్ట్రంలోనూ 2015 నాటి కన్నా 2019 నాటికి బరువు ఎక్కువ ఉన్న పిల్లల శాతం విపరీతంగా పెరిగింది.

ప్రపంచ ఊబకాయ సమాఖ్య (వరల్డ్ ఒబిసిటీ ఫెడరేషన్ )
ప్రపంచ ఊబకాలయ సమాఖ్య ఇటీవల వెలువరించిన అధ్యయనం ప్రకారం ప్రపంచం మొత్తం మీద పిల్లల్లో ఊబకాయం పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని వివరించింది. దీనికి భారత్ దేశం ఏమాత్రం మినహాయింపుకాదు. ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించలేకుంటే భారత్‌లోని పిల్లల్లో 2035 నాటికి ఏటా 9.1 శాతం ఊబకాయం పెరుగుతుందని అధ్యయనం హెచ్చరించింది. భారత్‌లో బాలురలో 2020 లో 3 శాతం ఊబకాలయం ఉండగా, వచ్చే 12 సంవత్సరాల్లో 12 శాతం వరకు పెరుగుతుందని, అలాగే బాలికల్లో 2020లో రెండు శాతం ఉండగా, వచ్చే 12 సంవత్సరాల్లో 7 శాతం పెరుగుతుందని హెచ్చరించింది. అలాగే పెద్దల్లో 2020 నుంచి ఏటా 5.2 శాతం వంతున స్థూలకాయం పెరుగుతోందని, 2035 నాటికి 11 శాతం పెరుగుతుందని నివేదిక వివరించింది. దీన్ని నివారించడంలో విఫలమైతే 2035 నాటికి 4.32 ట్రిలియన్ డాలర్ల వరకు ప్రపంచ ఆర్థిక ప్రభావం ఉంటుందని పేర్కొంది. ప్రపంచ జీడీపీలో దాదాపు 3 శాతంతో ఇది సమానం.

ఊబకాయం పెరగడానికి అనేక కారణాలు
అసమతుల్య ఆహారం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన , ప్యాకేజీ ఆహార పదార్ధాల వినియోగం, చలనం లేని జీవన శైలి, ఇవన్నీ అత్యధిక కేలరీలను అదుపు చేయలేకపోతున్నాయని పిల్లల హక్కుల సంస్థ సిఆర్‌వై సీఇఒ పూజా మర్వాహా వెల్లడించారు. ఫాస్ట్ ఫుడ్స్, తియ్యనైన పానీయాలు, కేలరీలు పెరగడానికి దోహదం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. స్వల్పాదాయ కుటుంబాలకు పోషక విలువలున్న కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ల విలువలున్న ఆహార పదార్థాలు అందుబాటు కాకపోవడం కూడా ప్రధాన కారణంగా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News