Monday, April 29, 2024

కంటైనర్ డిపోలో పేలుడు… 49 మంది దుర్మరణం

- Advertisement -
- Advertisement -

49 Killed In Fire Accident At Bangladesh

బంగ్లాదేశ్‌లో 49 మంది దుర్మరణం
300 మందికి గాయాలు
దద్దరిల్లిన చిట్టగాంగ్ ఏరియా

ఢాకా : బంగ్లాదేశ్‌లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో కనీసం 49 మంది దుర్మరణం చెందారు. చిట్టగాంగ్‌లో ఓ షిప్పింగ్ కంటైనర్ డిపోలో భారీ స్థాయి అగ్ని ప్రమాదంతో శనివారం అర్థరాత్రి దాటిన తరువాత పలువురి ప్రాణాలు మంటలలో కలిసిపొయ్యాయి. ప్రమాద ఘటనపై ఆదివారం స్థానిక అధికారులు తెలిపారు. సీతాకుంద్ర ప్రాంతంలోని డిపోలో మంటలు చెలరేగినట్లు ఈ ఘటనలో ఇప్పటికే 300 మంది వరకూ గాయపడ్డట్లు నిర్థారణ అయిందని, మృతుల సంఖ్య 49 వరకూ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే పూర్తి వివరాల సేకరణ తరువాత అధికారికంగా మృతుల సంఖ్యను తెలియచేసేందుకు వీలుందని వివరించారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు.

రసాయనిక చర్య కారణంగానే కంటైనర్ డిపోలో ఉన్నట్లుండి మంటలు చెలరేగాయని ప్రాధమిక దర్యాప్తులో తేలిందని చిట్టగాంగ్ పోలీసు అధికారి నూరుల్ అలం తెలిపారు. గాయపడ్డ వారిని చిట్టగాంగ్ వైద్య కాలేజీ అనుబంధ ఆసుపత్రులకు చికిత్సలకు తరలించారు. అయితే ఓ పేలుడు వల్లనే మంటలు వ్యాపించాయని స్థానిక మీడియా వార్తా కథనాలు వెలువరించింది. అయితే ఈ వాదనలో నిజం లేదని ముందు మంటలు చెలరేగి తరువాతనే పేలుడు జరిగిందని అధికారులు తెలిపారు. అయితే భారీ శబ్దంతో అర్థరాత్రి జరిగిన పేలుడుతో సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు కూడా పగిలినట్లు స్థానికులు తెలిపారు. పేలుడు తరువాత డిపో నుంచి ప్రమాదకర రసాయనాలు సముద్రంలోకి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే చాలా సేపటివరకూ పరిస్థితి అదుపులోకి రాలేదని వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News