Monday, April 29, 2024

భారత్ కు 5 కోట్ల ఫైజర్ డోసులు….

- Advertisement -
- Advertisement -

5 crores vaccine import from Pfizer

 

ఢిల్లీ: 5 కోట్ల కరోనా డోసులు భారత్‌కు ఇచ్చేందుకు అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. భారత ప్రభుత్వంతో సదరు కంపెనీ యాజమాన్యం చర్చలు జరిపినట్లు ఆ కంపెనీ వర్గాలు తెలిపాయి. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అమెరికా అనుమతించలేదు. దీంతో ఐరోపా దేశాల్లో ఉత్పత్తి చేస్తున్న కేంద్రాల నుంచి నేరుగా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. ఎంఆర్‌ఎన్‌ఎ సాంకేతిక ఆధారంగా తయారు చేసి వ్యాక్సిన్లు భారత వేరియంట్లపై సమర్థవంతంగా పని చేస్తామని యురోపియన్ మెడిసిన్ ఏజెన్సీ తెలిపింది. ఫైజర్, మోడెర్నా, అస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ల వినియోగానికి అనుమతి ఇచ్చామని ఇఎంఎ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News