Wednesday, May 1, 2024

కరోనాతో అమెరికాలో 5లక్షల మంది మృతి

- Advertisement -
- Advertisement -

కరోనా వల్ల అమెరికాలో ఐదు లక్షలమంది మృతి
మూడు యుద్ధాల విషాదానికి సమానం

బాల్టీమోర్: కొవిడ్19 వల్ల అమెరికాలో ఇప్పటివరకు ఐదు లక్షలమంది చనిపోయారు. ఈ సంఖ్య రెండో ప్రపంచ యుద్ధం, కొరియా యుద్ధం(ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధంలో దక్షిణ కొరియా తరఫున అమెరికా సైన్యం పాల్గొన్నది), వియత్నాం యుద్ధంలో అమెరికా సైనికుల మరణాల సంఖ్యకు సమానమని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ లెక్క కట్టింది. ఈ మరణాల సంఖ్య ఆ దేశంలోని కన్సాస్ నగర జనాభాకు సమానమన్నది మరో లెక్క. రెండో ప్రపంచ యుద్ధంలో 4,05,000మంది, వియత్నాం యుద్ధంలో 58,000మంది, కొరియా యుద్ధంలో 36,000మంది అమెరికా సైనికులు మృతి చెందారు. కొన్ని వారాలుగా అమెరికాలో సగటు కేసులు, మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయితే, కరోనా వ్యారి యెంట్స్‌లోని కొన్ని ప్రమాదకరంగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5 lakhs people died due to Corona in US

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News