Wednesday, May 15, 2024

7 గంటల పాటు చైనా వ్యోమగాముల స్పేస్ వాక్

- Advertisement -
- Advertisement -

7 hours Chinese astronauts spacewalk

 

బీజింగ్ : చైనా వ్యోమగాములు ఇద్దరు లియు బోమింగ్, టాంగ్ హోంగ్‌బో లు కొత్త అంతరిక్ష కేంద్రం బయట ఆదివారం దాదాపు ఏడు గంటలపాటు స్పేస్‌వాక్ జరిపారు. 15 మీటర్ల ( 50 అడుగుల ) పొడవైన రొబోటిక్ హస్తాన్ని ఉపయోగించి అంతరిక్ష కేంద్రానికి కెమెరాలు , ఇతర పరికరాలు అమర్చారు. వీరిద్దరూ బయటకు రావడం, మూడో వ్యోమగామి కమాండర్ నీ హెయిషెంగ్ కేంద్రం లోపలే ఉండడం ఇవన్నీ చైనా అధికారిక టివి ప్రత్యక్షంగా చూపించింది. చైనా మూడో అంతరిక్ష కేంద్రంలో మూడు నెలల పాటు ఉండడానికి మిషన్‌లో భాగంగా జూన్ 17న ఇక్కడికి వచ్చారు. గత మే నెలలో అంగారక గ్రహంపై రోబో రోవర్‌ను ప్రవేశ పెట్టిన మిషన్‌లో భాగంగా వీరు అంతరిక్ష కేంద్రానికి వచ్చారు. చైనా అధికార కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల వేడుక నిర్వహిస్తున్న సందర్భంగా ఈ మిషన్ చేపట్టింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News