Saturday, April 27, 2024

ఆస్తి పంచలేదని తల్లి మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచిన కూతుళ్లు

- Advertisement -
- Advertisement -

కామారెడ్డి : ఆస్తి పంపకాలు జరుపలేదనే నేపంతో మృతి చెందిన తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి కన్న కూతుళ్లు నిరాకరించారు. దారుణమైన ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ బి నగర్ కాలనీకి చెందిన కిష్టవ్వ 70 అనారోగ్యంతో భాద పడుతుండటంతో కుటుంబ సభ్యులు గత నెల 21న ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె సుమారు పది హేను రోజుల పాటు చికిత్స పొందుతు శనివార రాత్రి మృతి చెందింది.

Also Read: మాదాపూర్‌లో కార్డెన్ సెర్చ్.. మద్యం బాటిళ్లు సీజ్

మృతురాలికి ముగ్గురు కూతుళ్లు కాగా ఒక కూతురు మృతి చెందింది.ఎల్లవ్వ, పెంటవ్వ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి పేరు పైన ఇళ్లు, డిపాసిట్ పేరిట లక్షా 70 ఉన్నాయి. వీటికి మృతురాలి బంధువు ఒకరు నామినీగా ఉన్నారు. కిష్టవ్వ బతికుండగా ఆస్తి పంపకాలు జరుపలేదని డిపాజిట్ డబ్బులు తమకు ఇప్పించేంత వరకు తల్లి శవాన్ని తీసుకుళ్లెమని ఇద్దరు కూతుళ్లు శవాన్ని ఒదిలేసినట్లు డ్యూటీ డాక్టర్ మౌనిక తెలిపారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది మార్చురిలో వృద్దురాలి శవాన్ని ఉంచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News