Friday, May 3, 2024

మండిపోతున్న కూరగాయల ధరలు

- Advertisement -
- Advertisement -

76% households feel pay more for vegetables

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తితో గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువులతో పాటుగా కూరగాయల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో ఏం కొని తిని బతకాలో అర్థం కాని స్థితిలో సామాన్యడు అల్లాడిపోతున్నాడు. కూరగాయల ధరలు భారమవడంతో గత రెండేళ్లలో వీటి కొనుగోలుపై 25నుంచి వంద శాతం వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోందని 76 శాతం గృహస్తులు వెల్లడించారు. ప్రముఖ కమ్యూనిటీ సోషల్ మీడియా వేదిక ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో ధరల పెరుగుదలపై షాకింగ్ వివరాలు వెలుగు చూశాయి.

ధరల పెరుగుదలతో ఈ ఏడాది కిలో టమోటాపై రూ. 50, ఉల్లి గడ్డలకు రూ.30, ఆలూకు కిలోకు రూ.25 చొప్పున అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ప్రతి ఇద్దరు వినియోగదారుల్లో ఒకరు వెల్లడించారని సర్వే పేర్కొంది. ఇక 36 శాతం వినియోగదారులు కూరగాయలపై 25నుంచి 50 శాతం అధికంగా ఖర్చు చేస్తున్నారని, 31 శాతం మంది కూరగాయలపై చేసే ఖర్చు ఏకంగా 50 శాతంనుంచి 100 శాతం అధికంగా ఉంటోందని వెల్లడించారు. స్థానికంగా పండే కూరగాయలు మినహా దూరప్రాంతాలనుంచి వచ్చే కూరగాయల ధరలు మండిపోతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. పొలంనుంచి మార్కెట్‌కు రవాణా చార్జీల కారణంగా కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటున్నాయని, అంతేకాకుండా కూరగాయలు తీసుకువచ్చే ప్రాంతం కూడా వాటి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయని లోకల్ సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ త్రిపాఠీ అభిప్రాయపడ్డారు. ఇక సెప్టెంబర్‌లో ఆహార ద్రవ్యోల్బణం8.60 శాతానికి పెరగ్గా, అక్టోబర్‌లో అది మరింతగా ఎగబాకడంతో కూరగాయలు, పండ్లు సహా ఆహారోత్పత్తుల ధరలు అనూహ్యంగా పెరిగాయి.

76% households feel pay more for vegetables

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News