Saturday, May 4, 2024

ఓటుకు నోటు కేసులో 960 పేజీల చార్జిషీట్

- Advertisement -
- Advertisement -

revanth reddy

 

తదుపరి విచారణ ఏప్రిల్ 20కి వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్ : ఎసిబి ప్రత్యేక కోర్టు ఓటుకు నోటు కేసును మంగళవారం నాడు విచారించిన అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది. కాగా ఈ కేసు నిందితులు సెబాస్టియన్, ఉదయ సింహ కోర్టులో హాజరయ్యారు. కాగా ఎ1గా ఉన్న ఎంపి రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉండటంతో ఆయనను కోర్టులో హాజరుపర్చలేదు. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించిన ఎసిబి మొత్తం 960 పేజీలతో చార్జిషీట్ దాఖలు చేసింది. అందులో ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్రధారుల సంబంధించి కీలక విషయాలను అధికారులు వివరించారు.

మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన ఆడియో టేపుల ఫోరెన్సిక్ నివేదిక కోర్టుకు చేరింది. ఓటుకు నోటు నిమిత్తం స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వజూపిన డబ్బు ఎక్కడినుంచి వచ్చిందనేది కీలకం కానుందని, త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాగా, 2015లో టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు డబ్బు ఇవ్వజూపారనే ఆరోపణలు ఉన్నాయి.

నాకు ప్రాణహాని ఉంది : సెబాస్టియన్
ఓటుకు నోటు కేసులో ఎ2 నిందితుడిగా ఉన్న సెబాస్టియన్ తనకు ప్రాణ ఉందని రక్షణ కల్పించాలని కోరారు. ఇటీవల కాలంలో బెదిరింపులు, దాడులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. టిడిపి నేతలను తనను ఈ కేసులో ఇరికించారని, ఆడియో టేపుల ఫోరెన్సిక్ రిపోర్ట్‌పై విచారణ జరిగితే కీలక వ్యక్తులు వెలుగులోకి వస్తారని చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన నిజనిజాలన్ని కోర్టుకు తెలియజేస్తానని, తనకు కొందరితో ప్రాణహాని ఉందని కాపాడాలని వేడుకున్నాడు.

960 pages of chargesheet in case of note for vote
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News