Sunday, May 5, 2024

అత్యాశకు పోతే…

- Advertisement -
- Advertisement -

Atyasha kathalu

 

ప్రాచీన గ్రీకు రాజు పేరు మిడాస్. ఆ రాజుకి బంగారం అంటే చాలా ఇష్టం. అతని దగ్గర చాలా సంపద ఉంది. ఒక చక్కని కూతురు కూడా ఉంది. ఒక రోజు ఆ రాజు బంగారు నాణాలు లెక్కించుకుంటూ ఉండగా అదృష్ట దేవత ప్రత్యక్షమైంది. రాజు ఆమెను ఆదరించి, గౌరవించాడు. అతని మర్యాదలకి సంతోషించిన అదృష్ట దేవత ఏదైనా వరం కోరుకోమంది. రాజు అస్సలు ఆలోచించకుండా, నేను దేన్ని ముట్టుకున్నా అది బంగారంగా మారాలని కోరాడు.

దేవతకి తెలుసు ఇదేమంత గొప్ప వరం కాదని, కానీ అడిగాడని, కాదనక, రాజుకా వరం ఇచ్చేసింది. రాజు మహా సంతోషంతో, ఎదురుగా ఉన్న ఒక ఆపిల్ పండుని ముట్టుకున్నాడు. అది వెంటనే మెరిసిపోతూ బంగారు పండుగా మారిపోయింది. ఇంకా వెర్రి ఆనందంగా రాజా భవనంలోని వస్తువుల్ని బంగారుమయం చేస్తుండగా, అక్కడికి అతని కుమార్తె వచ్చింది.

పరమానందంతో గబాగబా వెళ్లి పట్టేసుకున్నాడు. అంతే, ఆ పాప జీవంలేని ఒక బంగారు బొమ్మగా మారిపోయింది. అది చూసి రాజు ఏడుస్తూ, అదృష్ట దేవత కోసం ప్రార్థించాడు. నాకీ శక్తి వద్దు. నా పిల్లకి మామూలు రూపం రావాలని కోరుకున్నాడు. బంగారంగా మారినవన్నీ మళ్ళీ యథారూపంలోకి వచ్చాయి. అమ్మాయిని చూసుకుని రాజు మురిసిపోయాడు. రాజుకి బుద్ధి వచ్చింది. తనకున్న దానితో హాయిగా, తృప్తిగా జీవించటం నేర్చుకున్నాడు.

నీతి: అత్యాశకి పోకూడదు. మనకున్నదానిలో సంతృప్తిగా ఉండటం మంచిది.

 

Atyasha kathalu in telugu
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News