Monday, May 6, 2024

తడి చెత్తను ఎరువుగా తయారు చేసి రైతులకు ఇస్తాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

 

జనగామ: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వల్లే జనగామ జిల్లా అయిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. జనగామ జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. ప్రజల దగ్గరకే పరిపాలన తీసకొచ్చామని, తండాలను, గూడాలను పంచాయతీలుగా మార్చామన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని వివరించారు. బిడి కార్మికుల పెన్షన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సిఎం కెసిఆర్ అని ప్రశంసించారు. అన్ని పట్టణాల్లో పచ్చదనం-పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాలని, వార్డు కమిటీలు పారిశుద్ధ్య ప్రణాళికలు అమలు చేయాలన్నారు. జనగామలో తడి చెత్తను ఎరువుగా తయారు చేసి రైతులకు ఇస్తామని చెప్పారు. సిరిసిల్లలో పొడి చెత్త నుంచి నెలకు రెండున్నర లక్షలు రూపాయలు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. రెండు నెలల్లో జనగామలో వంద టాయిలెట్లు నిర్మిస్తామని, ఆరు నెలల్లో విద్యుత్ స్తంభాలు, వేలాడే వైర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అక్రమ లే అవుట్లపై ఉక్కుపాదం మోపండని, నివాస ప్రాంతాల్లో పందులు లేకుండా చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ నిఖిల, తదితరలు పాల్గొన్నారు.

 

KTR Speech in Jangaon District
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News