- Advertisement -
హైదరాబాద్ : నిషేధిత గంజాయిని ఎల్బి నగర్ శివారులో డిఆర్ఐ అధికారులు శనివారం పట్టుకున్నారు. ట్రక్కులో అక్రమంగా తరలిస్తున్న 1,554 కిలోల గంజాయిని పట్టుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డిఆర్ఐ అధికారులు పట్టుకున్న గంజాయి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి హైదరాబాద్ మీదుగా కర్ణాటక బీదర్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు. కారులో పైలట్‌గా కొందరు వస్తుండగా ఐచర్ వాహనంలో గంజాయిని తరలిస్తున్నారు. 751ప్యాకెట్లలో గంజాయిని నింపి బీదర్‌కు తరలిస్తున్నారు. ఇద్దరు డ్రైవర్లను, కారు యజమాని, ఇద్దరు నిందితులను, గంజాయిని సప్లయ్ చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు డిఆర్ఐ అధికారులు తెలిపారు.
Heavy marijuana seized in LB Nagar
- Advertisement -