Saturday, May 4, 2024

బ్రిటన్ రాణికి కరోనా భయం

- Advertisement -
- Advertisement -

Queen Elizabeth2

 

లండన్‌: కరోనా వైరస్ భయంతో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 రాజభవనం ‘బకింగ్ హాం ప్యాలస్’ ను వీడుతున్నారు. యూకేలో కరోనా వైరస్‌ ప్రభావంతో క్వీన్‌ఎలిజబెత్‌ -2ను లండన్‌లోని బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ నుంచి వింద్‌సార్‌ కాస్టిల్‌కు తరలించారు. బ్రిటన్‌లో కోవిడ్‌-19 ధాటికి మృతుల సంఖ్య 21కి చేరుకుంది. రానున్న కాలంలో కరోనా వ్యాప్తికి అవకాశాలు కన్పిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన బకింగ్‌ హామ్‌ ప్యాలెస్‌ అధికార యంత్రాంగం క్వీన్‌ ఎలిజబెత్‌-2తోపాటు ఆమె భర్త ప్రిన్ష్‌ పిలిప్‌ వింద్‌సార్‌ కాస్టిల్‌కు తీసుకెళ్లారు. నొర్‌ఫోక్‌లోని రాయల్‌ సాండ్రింఠఘామ్‌ ఎస్టేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉంచనున్నట్లు తెలుస్తోంది. యూకేలో ఇప్పటివరకు వెయ్యి మందికిపై కరోనా అనుమానిత లక్షణాలున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఎలిజిబెత్ రాణి ఆరోగ్యంగా ఉన్నారని, అయితే ముందు జాగ్రత్త చర్యగా ఈ ప్యాలస్ ఖాళీ చేస్తున్నారని రాజభవనం వర్గాలు పేర్కొన్నాయి.

In the corona panic Queen Elizabeth2
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News