Saturday, May 4, 2024

పిల్లి కోసం కోర్టు కెక్కాడు… పోలీసులకు షాక్

- Advertisement -
- Advertisement -

 

తిరువనంతపురం: పిల్లి కోసం పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టు పిటిషన్ దాఖలు చేసిన సంఘటన కేరళలోని కొచ్చి ప్రాంతంలో జరిగింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండడంతో దేశమంతా ప్రధాని నరేంద్ర మోడీ లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్రకాశ్ అనే వ్యక్తి పిల్లులకు ఆహారం పెట్టేందుకు వాహన పాస్ కావాలని ఏప్రిల్ 4న ఆన్‌లైన్ ద్వారా పోలీసులు దరఖాస్తు చేసుకున్నాడు. తాను వెజిటేరియన్‌నని, పిల్లులకు ఆహారం తయారు చేసేందుకు తన దగ్గర ఎలాంటి పదార్థాలు లేవని, మియో పెర్సియన్ బిస్కెట్లు కోనుగోలు చేయడానికి అనుమతి కావాలని విజ్ఞప్తి చేశారు. కాని ప్రకాశ్ చెప్పిన కారణం అత్యవసరమైనది కాకపోవడంతో పోలీసులు పాస్ ఇవ్వలేదు. వెంటనే కోర్టులో పోలీసులుపై పకాశ్ పిటిషన్ దాఖలు చేశాడు. జంతు, హింస నిరోధక చట్టంలోని 3, 11 సెక్షన్ల ప్రకారం జంతువులకు, ఆహారం, వసతి పొందే హక్కు ఉందన్నారు. ఇప్పటి వరకు భారత్ దేశంలో కరోనా రోగుల సంఖ్య 4375 చేరుకోగా 122 మంది మృత్యువాతపడ్డారు. కేరళలో కరోనా వైరస్ 314 మందికి సోకగా ఇద్దరు చనిపోయారు.

 

Cat-owner filed writ petition in HC against Police
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News