Wednesday, May 15, 2024

హైదరాబాద్‌లో చిరుత కలకలం ( వీడియో)

- Advertisement -
- Advertisement -

Leopard

హైదరాబాద్: నగర శివారులో చిరుత పుతి కలకలం రేపింది. కాటేదాన్ ప్రాంతంలోని ఎన్ హెచ్-7 జాతీయ రహదారిపై కనిపించిన చిరుత స్థానికులను భయపెట్టంది. తీవ్ర గాయాలతో ఉన్న చిరుత హైవే మీద ఎటూ కదలకుండా పడిఉంది. దీంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.

అక్కడికి చేరుకున్న అధికారులు ట్రాఫిక్ నిలిపివేసి చిరుతను బంధించడానికి ప్రయత్నించగా తప్పించుకుని సమీపంలోని ఓ ఫంక్షన్ హాలులోకి దూరింది. చిరుత తప్పించుకునే క్రమంలో ఓ వ్యక్తిని గాయపరిచింది. గాయపడిన అతనిని సమీప ఆస్పత్రికి తరలించారు. అది ఇంకా తప్పించుకుని తిరుగుతుండడంతో బంధించేందుకు అటవీ, జూపార్క్ సిబ్బంది శ్రమిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News