Friday, May 3, 2024

15 రోజులు మాత్రమే నీటిని తోడుకుంటాం

- Advertisement -
- Advertisement -

AP Government explanation to Krishna River Management Board

 

తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతుల్లేవు
కృష్ణాబోర్డుకు ఎపి వివరణ

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలంలో 881అడుగుల నీటిమట్టం నుంచి ఏడాదిలో కేవలం 15రోజులు మాత్రమే నీటిని తోడుకుంటామని కృష్ణానదీ యాజమాన్యం బోర్డుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అయితే తెలంగాణ లేవనెత్తిన ఆక్షేపణలపై సమాధానాలు ఇవ్వలేదు. 203 జిఒ మేరకు పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా 10 తూ ములు నిర్మించి రోజుకు 88 వేల క్యాసెక్కుల నీరు తరలించేందుకు ఎపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చెప్పలేదు.

ఇప్పటికే 4 తూముల ద్వారా తరలిస్తున్న 44 వేల క్యూసెక్కుల నీటి అంశాన్ని వివరించలేదు. కేవలం మాటవరుసకు చెప్పనట్లు శ్రీశైలం ప్రాజెక్టునుంచి వరదల కాలంలో నీటిని తోడుకుంటామని చెప్పడం పట్ల తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. జిఒ౨౦౩పై వివరణ ఇవ్వాల్సిన ఎపి ప్రభుత్వం తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులపై ఎదురు దాడికి దిగింది. దిగువప్రాంతాల నీటి అవసరాలు తీరకుండా తెలంగాణ కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తుందని ఆరోపించింది.

సోమవారం జలసౌధలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాద్ దాసు కృష్ణానదీ యాజమాన్యం బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌కు లేఖ సమర్పించారు. అయితే గత కొద్ది రోజుల క్రింత తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కృష్ణానదీ యాజమాన్యం బోర్డు ఆంధ్రప్రధేశ్‌కు నోటీసు ఇచ్చింది. అయితే ఆ నోటీసుకు వివరణ ఇవ్వకుండా, 203 జిఒపై విశదీకరించకుండా తెలంగాణ ప్రాజెక్టులను తప్పుబడుతూ ఎపి ప్రభుత్వం లేఖ సమర్పించింది.

రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం అంశాలను తెలంగాణ ప్రభుత్వం విస్మరించి కృష్ణానదీపై ప్రాజెక్టులు నిర్మిస్తోందని ఆరోపించింది. ప్రధానంగా రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం, దిండి ప్రాజెక్టు, భక్త రామదాసు, తుమ్మిళ్ల ప్రాజెక్టులను అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేకుండా నిర్మిస్తోందని కృష్ణానదీ యాజమాన్యం బోర్డుకు అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. అయితే ఇచ్చిన నోటీసు అంశాలపై బోర్డు వివరణ అడగగా ఎపి ప్రభుత్వం సమాధానాలను దాటవేసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News