Monday, May 6, 2024

చిరుత కోసం సాగుతున్న వేట

- Advertisement -
- Advertisement -

An Ongoing Hunt for The Leopard in Hyderabad

హైదరాబాద్: నగర శివారులోని రాజేంద్రనగర్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా మంగళవారం రాత్రి ఫారెస్ట్ అధికారి కారుపై చిరుత దాడికి యత్నించింది. దీంతో అధికారి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇదిలావుండగా యూనివర్సిటీ పరిధిలో సంచరించిన రెండు దుప్పిలు ఇప్పుడు కనిపించకపోవడంతో చిరుత వాటిని కూడా చంపినట్టు గుర్తించారు. ఒక దుప్పిపై దాడి చేసి సగభాగాన్ని పైగా చిరుత తినేసింది.

మిగతా సగభాగాన్ని అటవీశాఖ సిబ్బంది స్వాధీనం చేసుకుంది. చిరుత ఉన్న ప్రాంతాన్ని అధికారులు గుర్తించారు. త్వరలోనే పట్టుకొని జూ పార్క్‌కు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పంట పొలాల్లో అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన సిసిటివి కెమెరాలో చిరుత సంచారం నమోదైంది. దీంతో మేనేజ్, నార్మ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంప్‌సలోని క్వార్టర్స్‌లో నివాసముంటున్న వారు భ యాందోళనలకు గురవుతున్నారు. మే 14న గగన్‌పహాడ్ పాత కర్నూల్ రోడ్డులో రోడ్డుపై కనిపించిన చిరుత అక్కడినుంచి ఓ ఫాంహౌసలోకి వెళ్లి తిరిగి కనిపించకుండా పోయిన విషయం విదితమే.

అలాగే మే 28న రాజేంద్రనగర్ నుంచి నార్మ్ మీదుగా మేనేజ్ వెళ్లే ప్రాంతంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలాల్లో తిరుగుతూ గ్రేహౌం డ్స్ ప్రహరీపై ఉన్న సిసి కెమెరా ఫుటేజీలో కనిపించింది. దీంతో గ్రేహౌండ్స్ అధికారులు నార్మ్, వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులను అలర్ట్ చేశారు. వెంటనే మే 29న అటవీశాఖ అధికారులు చిరుత కనిపించిన ప్రాంతాల్లో సిసి కెమెరాలను అమర్చారు. సోమవారం రాత్రి 10:56 నిమిషాలకు మేనేజ్ ప్రహరీ వద్ద, 11:14 నిమిషాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం పొలా ల్లో తిరుగుతున్న చిరుత దృశ్యాలు వాటిల్లో రికార్డు కావడం తో ఆ దిశగా ఫారెస్ట్ అధికారులకు చిరుత కోసం వేట సాగిస్తున్నారు.

భయం..భయం..!

చిరుత సంచరిస్తున్న క్రమంలో మేనేజ్ క్వార్టర్స్‌లో ఉండేవారు రాత్రివేళ బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ద్విచక్రవాహనాలపై కూడా బయటకు రావడం లేదు. కార్లు ఉన్న వారు మాత్రమే వస్తున్నారు. చిరుత సంచార ప్రాంతాల్లో పనుల నిమిత్తం వెళ్లేందుకు జనం భయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News