Saturday, April 27, 2024

‘కామ్రేడ్ భారతక్క’గా ప్రియమణి.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

- Advertisement -
- Advertisement -

Priyamani

 

హైదారబాద్: టాలీవుడ్ యంగ్ హీరో రానా దగ్గుబాటి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విరాట పర్యం’. ఈ మూవీలో రానాకు జోడీగా యంగ్ బ్యూటీ, నాచురల్ స్టార్ సాయి ప‌ల్ల‌వి నటిస్తోంది. ఇటీవల సాయిపల్లవి పుట్టినరోజు పురస్కరించుకుని విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రంలో మరో సర్ ప్రైజ్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న ప్రియమణి పుట్టిన రోజు సందర్భంగా చిత్రయూనిట్ గురువారం ఆమె పాత్రకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు.

‘మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారి తీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట ప‌ర్వంలో ‘కామ్రేడ్ భారతక్క’ కూడా అంతే కీలకం’ అంటూ రానా తన ట్వీట్టర్ ద్వారా ప్రియమణి లుక్ ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ మూవీలో కామ్రేడ్ భారతక్క పాత్రలో ప్రియమణి నటిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ లో  ప్రియమణి లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. వేణు ఉడుగుల తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Priyamani first look released from Virata Parvam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News