Friday, May 3, 2024

అమెరికాలో నల్లజాతీయుడి కాల్చివేత

- Advertisement -
- Advertisement -
Black man was shot by police in America

 

మద్యం మత్తులో పెనుగులాట, గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు
నిలువరించే క్రమంలో కాల్చివేసిన పోలీసులు
రోడ్లపైకి వచ్చి నల్లజాతీయుల ఆందోళనలు

అట్లాంటా : ఇప్పటికే జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో రగిలిపోతున్న అమెరికాలో మరో ఘటన చోటుచేసుకుంది. తాజాగా అట్లాంటాలో ఓ నల్లజాతీయుడ్ని పోలీసులు కాల్చి చంపారు. దీంతో ఆ దేశంలో నిరసనలు మరింత తీవ్రం కావడంతో ఓ పోలీస్ ఆఫీసర్‌ను విధుల నుంచి తొలగించారు. ఓ రెస్టారెంట్ పార్కింగ్ వద్ద ఓ వ్యక్తి కారులో నిద్రపోతూ ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్నాడంటూ శుక్రవారం రాత్రి అట్లాంటా పోలీసులకు ఫోన్‌కాల్ వచ్చింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కారులో ఉన్న 27 ఏండ్ల రేషార్డ్ బ్రూక్స్ మద్యం సేవించి అలా ప్రవర్తిస్తున్నాడని గుర్తించి, పరీక్ష ద్వారా నిర్ధారించారు.

అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా పెనుగులాట జరిగింది. ఇంతలో ఓ పోలీస్‌కు చెందిన గన్‌ను బ్రూక్స్ లాక్కొని పరుగులు పెట్టాడు. నిలువరించేందుకు పోలీసులు హెచ్చరించడంతోపాటు కాల్పులు జరుపడంతో బ్రూక్స్ చనిపోయాడు. ఈ ఘటనను ఖండిస్తూ ఆందోళనకారులు శనివారం పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. బ్రూక్స్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ప్రాంతంలోని రెస్టారెంట్‌తోపాటు కొన్ని వాహనాలకు నిప్పుపెట్టారు. మరోవైపు బ్రూక్స్ మరణంపై స్పందించిన అట్లాంటా పోలీస్ చీఫ్ ఎరికా షీలడ్స్ తన పదవికి రాజీనామా చేశారు. కాగా అతడిపై కాల్పులు జరిపిన ఓ పోలీస్ అధికారిని విధుల నుంచి తొలగించగా మరొకరిని ఇతర విధులకు మళ్లించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News