Thursday, May 16, 2024

ఖాట్మండ్ వాదానికి మద్దతుగా నేపాల్ ఎఫ్‌ఎం రేడియో ప్రచారం

- Advertisement -
- Advertisement -

Nepal FM Radio Campaign in Support of Kathmandi

 

పిథోరగఢ్ (ఉత్తరాఖండ్) : కాలాపాని, లిపులేఖ్, లింపియధుర ప్రాంతాలన్నీ తమ భూభాగాలంటూ ఖాట్మండ్ లేవ దీసిన వివాదానికి మద్దతుగా సరిహద్దు ప్రాంతాల్లో నేపాల్ ఎఫ్‌ఎం రేడియో ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని సరిహద్దు గ్రామాల ప్రజలు చెప్పారు. కొన్ని ఛానళ్లు నేపాల్ గీతాల విరామంలో భారత వ్యతిరేక ప్రసంగాలు వినిపిస్తున్నాయని దంటు గ్రామస్థుడు శాలుడటాల్ చెప్పారు. నేపాల్ మావోయిస్టు నేతలు ఈ ప్రసంగాలు వినిపిస్తున్నారని తెలిపారు. నేపాల్ ధారుచులా జిల్లా కేంద్రంలో ఉన్న ఎఫ్‌ఎం స్టేషన్లు తమ మూడు కిలోమీటర్ల పరిధిలో భారత్ సరిహద్దులో ఉన్న ధారుచులా, బాల్యుకోట్, జౌల్జిబి, కాళికా ప్రాంతాల్లో ఈ ప్రచారం జోరుగా సాగుతోందని వివరించారు. అయితే జిల్లా యంత్రాంగం, పోలీసులు ఈ విధంగా ప్రచారం జరుగుతున్నట్టు తమకెలాంటి సమాచారం లేదని పేరొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News