Monday, May 6, 2024

ఆర్‌టివో కార్యాలయం ముందు ప్రైవేట్ క్యాబ్స్‌, బస్సు నిర్వాహకుల ఆందోళన

- Advertisement -
- Advertisement -

Private cab and bus owners protest in front of RTO office

 

మన తెలంగాణ, హైదరాబాద్ : ట్యాక్స్ మినహయింపు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ స్టేట్ క్యాబ్స్, బస్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్ (టిఎస్‌సిబివోఏ )ఆధ్వర్యంలో ఖైతరాబాద్‌లోని రవాణాశాఖ ప్రధాన కార్యాలయం ఎదుట అసోసియేషన్ నాయకులు ఉదయం 11.30 గంటలకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఈ ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయ్యింది. దాంతో ఆయ మార్గంలో వెళ్ళేవాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని ఆందోళనకారులను అరెస్టుచేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అనంతరం అసోసియేషన్ నాయకులు సయ్యద్ నిజాముద్దిన్, గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ … లాక్‌డౌన్ కారణంగా తాము వాహనాలను నడపలేదని దాంతో తామే ఆర్దికంగా ఇబ్బందిడ్డామని తెలిపారు.

అయితే ఇదే అంశం సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు తెలియచేయగా ట్యాక్స్ రద్దుపై తాము ఎటువంటి హామీఇవ్వలేమని, అయితే నాన్‌యూజ్ కింద పెట్టేందుకు దరఖాస్తులను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ట్యాక్స్‌గడువు అక్టోబర్ 30 వరకు ఉండటంతో అప్పటి వరకు వాహనట్యాక్స్ రద్దు ప్రతిపాదనలు సిఎంకు వివరిస్తామని తెలిపారు. బుధవారం చివరితేదీ కావడంతో ట్యాక్స్ రద్దుకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు. ఇదే అంశాన్ని తాము సిఎం దృష్టికి తీసుకెళ్ళేందుకు మరి కొద్ది రోజులు గడువు ఇవ్వాలని అధికారులు కోరినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4993 ప్రైవేట్, 3.5 లక్షల క్యాబ్స్ నడుస్తున్నాయని వీటి మీద లక్షల కుంటుంబాలు ఆధారప పడిజీవిస్తున్నారని తెలిపారు. ట్యాక్స్‌ను రద్దు చేయకపోతే ఆయా కుటుంబాలు మరింత ఆర్దికంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News