Monday, April 29, 2024

లక్షా 90 వేలు దాటిన కరోనా…

- Advertisement -
- Advertisement -

Telangana Corona Health Bulletin Today

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు లక్షా 90వేలు దాటాయి. మంగళవారం 55,359 మందికి పరీక్షలు చేయగా 2103 పాజిటివ్‌లు తేలాయి. వీరిలో జిహెచ్‌ఎంసి పరిధిలో  298 మంది ఉండగా ఆదిలాబాద్‌లో 24, భద్రాద్రి 102, జగిత్యాల 46, జనగామ 29, భూపాలపల్లి 25, గద్వాల 23, కామారెడ్డి 53, కరీంనగర్ 103, ఖమ్మం 93, ఆసిఫాబాద్ 26,మహబూబ్‌నగర్ 45, మహబూబాబాద్ 45, మంచిర్యాల 27, మెదక్ 30, మేడ్చల్ మల్కాజ్‌గిరి 176, ములుగు 31, నాగర్‌కర్నూల్ 32, నల్గొండ 141,నారాయణపేట్ 8, నిర్మల్ 24,నిజామాబాద్ 57, పెద్దపల్లి 31, సిరిసిల్లా 40, రంగారెడ్డి 172, సంగారెడ్డి 63, సిద్ధిపేట్ 92, సూర్యాపేట్ 51,వికారాబాద్ 24, వనపర్తి 41, వరంగల్ రూరల్ 35 ,వరంగల్ అర్బన్ లో 85, యాదాద్రిలో మరో 31 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

అదే విధంగా వైరస్ దాడిలో మరో 11 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 1,91,386కి చేరగా, ప్రస్తుతం 1,60,933 మంది ఆరోగ్యవంతులుగా ఇళ్లకు వెళ్లారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆధీనంలో 29,326 మంది చికిత్స పొందుతుండగా వీరిలో 23,880 మంది ఐసొలేషన్ సెంటర్లలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు హెల్త్ డైరెక్టర్ ప్రకటించారు. అదే విధంగా వైరస్ దాడిలో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 1127 కు పెరిగిందని వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ డా శ్రీనివాసరావు ప్రకటించారు.

మిలియన్‌కు 80వేల మందికి పరీక్షలు…

రాష్ట్రంలో కరోనా టెస్టులు సంఖ్య వేగంగా పెరుగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సంఖ్య కంటే సుమారు 16 రెట్లు అధికంగా నిర్వహిస్తున్నట్లు హెల్త్ డిపార్ట్‌మెంట్ వెల్లడిస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 29,96,001 మందికి పరీక్షలు చేశారు. అంటే ప్రతి పది లక్షల్లో 80,494 మందికి టెస్టులు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. కానీ డబ్లూహెచ్‌ఓ ప్రతి మినియన్‌కు కేవలం 140 మాత్రమే సూచించిందని, దాని మేరకు తెలంగాణలో రోజుకు కేవలం సుమారు ఐదువేలకు పైగా మాత్రమే పరీక్షలు చేయాల్సి ఉంటుందని డిహెచ్ గుర్తుచేశారు.

లక్షా 60 వేల మంది కోలుకున్నారు….

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,91,386 పాజిటివ్‌లు తేలగా, వీరిలో 1,60,933 మంది కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం కేవలం 29,326 యాక్టివ్ కేసులుండగా వీరిలో 23,880 ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు. దీంతో రాష్ట్రంలో రికవరీ రేట్ 84.08కి పెరిగింది. ఇది దేశ సగటు 83.27 శాతం ఎక్కువగా నమోదైంది. ప్రభుత్వాసుపత్రులో మెరుగైన వైద్యం అందడం వలనే ఈ ఫలితాలు వస్తున్నట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News